2024 ఎన్నికలే లక్ష్యంగా ఏపీలో ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు అధికార పార్టీ జగన్.ప్రతిపక్ష చంద్రబాబు.మొదటగా ఉత్తరాంధ్రపైనే ఇద్దరు నేతలు ఫోకస్ పెట్టారు.నిజానికి ఏపీ రాజకీయాల్లో ఉత్తరాంధ్ర ప్రధాన పాత్ర పోషిస్తోంది.
దీంతో ఉత్తరాంధ్రలో పర్యటనలు ఎక్కువయ్యాయి.ఇప్పటి నుంచే అక్కడ సెంటిమెంట్ రగిల్చి ఓట్లు రాబట్టే పనిలో ఏపీ సీఎం జగన్ ఉన్నారు.
చంద్రబాబు కూడా గత ఎన్నికల్లో దారుణంగా దెబ్బతినడంతో ఈసారి ఉత్తరాంధ్రపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం, విశాఖపట్టణం, విజయనగరంలో పర్యటనలు చేయనున్నట్లు సమాచారం.
రీసెంట్ గా ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించిన జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.విశాఖను రాజధానిగా చేస్తామంటే టీడీపీ అడ్డుకుందని, ఉత్తరాంధ్రుల ఆత్మగౌరవం అంటూ.సెంటిమెంట్ బాణాలు ఎక్కుపెట్టారు.దీంతో చంద్రబాబు రూటు మార్చారు.
జిల్లాల్లో టూర్లు వేయలకున్న బాబు నిర్ణయం మార్చుకున్నారు.ఇప్పటికే అక్కడి నేతలతో మంతనాలు జరిపినట్లు సమాచారం.
అక్కడి ముఖ్య నేత, ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్ చార్జులు, నాయకులతో పార్టీ బలోపేతంపై చర్చించినట్లు తెలుస్తోంది.
శ్రీకాకుళం నుంచే మొదటగా టూర్ మొదలు పెట్టిన బాబు విశాఖ జిల్లా మీదుగా గోదావరి జిల్లాల్లో కూడా పర్యటనలకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
విశాఖ రాజధానిని బాబు అడ్డుకున్నారని జగన్ చేసిన కామెంట్ కి బాబు ఎలా కౌంటర్ ఇస్తారోనని ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు.ఉత్తరాంధ్రకు టీడీపీ ఏం చేసింది.ఇకపై ఏం చేయబోతుందనేది బలంగా వినిపించనున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

2019లో టీడీపీ కంచుకోట ఉత్తరాంధ్రలో దారుణంగా దెబ్బతినడంతో ఈ సారీ గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు సమాచరం.విశాఖ రాజధాని, ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మగౌరవంతో ముందుకెళ్తున్న వైసీపీకి టీడీపీ ఏవిధంగా కౌంటర్ ఇస్తుందో.ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఎవరు నెగ్గనున్నారో వేచి చూడాల్సిందే.