ప్రతి హీరోకు కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి.అయితే హీరోల ఫ్యాన్స్ కూడా కొన్ని విషయాలకు సంబంధించి సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు.
మహేష్ బాబు అభిమానులు సర్కారు వారి పాట సినిమాకు ఒక థియేటర్ ను తప్పనిసరిగా కేటాయించాలని పట్టుబడుతున్నారు.అయితే ఈ విషయంలో ఎట్టకేలకు మహేష్ బాబు ఫ్యాన్స్ పై చేయి సాధించడం గమనార్హం.
మార్చి నెల 25వ తేదీన విడుదలైన ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే.
ఈ సినిమా ప్రముఖ థియేటర్లలో ఒకటైన సుదర్శన్ 35ఎం.
ఎంలో ప్రదర్శితమవుతోంది.మే 12వ తేదీకి ఆర్ఆర్ఆర్ 48వ రోజు కావడంతో ఈ థియేటర్ లో సినిమాను 50 రోజులు ఆడించాలని మెగా, నందమూరి అభిమానులు పట్టుదలతో ఉన్నారు.
అయితే ఈ థియేటర్ లో విడుదలైన మహేష్ బాబు సినిమాలు ఒక్కడు, మురారి, పోకిరి, శ్రీమంతుడు, సరిలేరు నీకెవ్వరు, దూకుడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.

ఈ థియేటర్ లో మహేష్ సినిమా విడుదల కాకపోతే సినిమా ఫ్లాపవుతుందేమోనని మహేష్ బాబు ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.అయితే ఎట్టకేలకు మహేష్ బాబు ఫ్యాన్స్ కృషి ఫలించి ఫలితం దక్కింది.సుదర్శన్ 35 ఎంఎంలో రిలీజ్ రోజున సర్కారు వారి పాట రెండు లేదా మూడు షోలు వేస్తారని ఆర్ఆర్ఆర్ 50 రోజులు పూర్తైన తర్వాత ఈ థియేటర్ లో సర్కారు వారి పాట రెగ్యులర్ షోస్ ప్రదర్శిస్తారని సమాచారం.

కర్ర విరగదు పాము చావదు అన్న విధంగా అటు ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ హర్ట్ కాకుండా ఇటు మహేష్ ఫ్యాన్స్ హర్ట్ కాకుండా సుదర్శన్ థియేటర్ ఓనర్లు నిర్ణయం తీసుకున్నారు.సర్కారు వారి పాట సెంటిమెంట్ ప్రకారం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందేమో చూడాల్సి ఉంది.







