ఇవన్నీ వైసీపీ వైఫల్యాలే.. పసుపు దండు గట్టి ప్రచారం

ఏపీలో రాజకీయ సమరం జోరుగా సాగుతోంది.రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది.

 Tdp Campaigns On Ycp Government Failures. Andhra Pradesh, Tdp, Ysrcp,  Ys Jagan,-TeluguStop.com

ఒకవైపు పొత్తులపై మాటలు, మరోవైపు ప్రచారాలు.ఇలా అధికార పార్టీ, ప్రతిపక్షాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.

అయితే ప్రధాన పోటీ మాత్రం వైసీపీ, టీడీపీ మధ్యే కనిపిస్తోంది. జనసేన, బీజేపీ నేతలు ఈ సమరంలో తాము కూడా ఉన్నామని చెప్పుకునేందుకు ఆరాటపడుతున్నా… మాటల యుద్ధం మాత్రం పచ్చరంగు, నీలి రంగు పార్టీ నేతల మధ్యే జరుగుతోంది.

టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ అంతా పర్యటిస్తూ పసుపు దండులో నూతన ఉత్సాహం తెస్తున్నారు.అదే సమయంలో ఆయన వైసీపీ వైఫల్యాలను, ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను విస్తృతస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు.

శుక్రవారం నాడు చంద్రబాబు కర్నూలులో పర్యటించారు.ఈ సందర్భంగా ఏపీని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించిన ఘనత జగన్‌కే దక్కుతుందని ఎద్దేవా చేశారు.

క్విట్ జగన్ – సేవ్ ఆంధ్రప్రదేశ్‌ నినాదంతో ప్రజా ఉద్యమం చేపట్టాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలో జగన్ దారుణంగా విఫలమయ్యారని.

వాలంటీర్ జాబులు తప్ప ఇప్పటివరకు ఉద్యోగాల నోటిఫికేషన్‌లు ఇవ్వలేకపోయారని చంద్రబాబు ఆరోపించారు.ఇది జగన్ సర్కార్ వైఫల్యమేనని అభివర్ణించారు.

Telugu Andhra Pradesh, Ap Poltics, Chandra Babu, Ys Jagan, Ysrcp-Telugu Politica

పోనీ వాలంటీర్లకు అయినా జాబ్ గ్యారంటీ ఉందా అంటే అది కూడా లేదన్నారు.మరోవైపు సీపీఎస్ రద్దుకు సంబంధించి ఎన్నికల ముందు జగన్ హామీ ఇచ్చారని.ఇప్పుడు అధికారంలోకి వచ్చాక సీపీఎస్ కాదు జీపీఎస్ అంటున్నారని గుర్తుచేశారు.దీంతో ఉద్యోగులు కూడా వైసీపీ ఓట్లు వేసే పరిస్థితి కనిపించడం లేదని చంద్రబాబు అన్నారు.బీసీలకు సంబంధించి విదేశీ విద్యకు గతంలో అందించిన ఆర్థిక సాయం కూడా జగన్ ప్రభుత్వం నిలిపివేసిందని చంద్రబాబు విమర్శించారు.ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని.

బీసీలకు ఏదో చేస్తున్నామని పెద్ద కలరింగ్ ఇవ్వడం తప్ప ఈ ప్రభుత్వం చేసేదేమీ లేదన్నారు.ముఖ్యంగా వైసీపీ పాలనలో ధరలు ఎలా ఉన్నాయో ప్రజలే చూస్తున్నారని.

చెత్తపై కూడా పన్ను వేస్తున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందని చంద్రబాబు సెటైర్లు వేశారు.రాష్ట్రంలో మద్యనిషేధం చేస్తామని చెప్తూ.

మద్యం ధరలు భారీగా పెంచుతున్నారని.సంక్షేమ పథకాల పేరుతో పేదలకు ఒక చేత్తో ఇచ్చిన డబ్బులను మరొక చేత్తో లాగేసుకుంటూ ఊకదంపుడు ప్రచారం చేసుకుంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

ఈ వైఫల్యాలన్నీ వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఇంటికి పంపనున్నాయని జోస్యం చెప్పారు.కాగా వచ్చే ఎన్నికలకు టీడీపీ నుంచి తొలి అభ్యర్థిని చంద్రబాబు ప్రకటించారు.

డోన్ నుంచి టీడీపీ తరఫున ధర్మవరం సుబ్బారెడ్డి పోటీ చేయనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube