జగన్ ప్లాన్ వర్క్ అవుట్ అయ్యిందా...? 'గాలి' తిరిగినట్టేనా ...?

ఎత్తులు.పై ఎత్తులు… వ్యూహాలు… ప్రతివ్యూహాలు ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల మధ్య సర్వసాధారనమే.

 Ys Jagan Plan For Bc Vote Bank About Ap Elections In 2019-TeluguStop.com

ఒక పార్టీ ఇచ్చిన వాగ్దానాలను మించి మరో పార్టీ వాగ్దానాలు చేస్తూ… ప్రజల్లో బలం పెంచుకునేందుకు చూస్తాయి.అధికార పార్టీ ఎన్నికల వాగ్దానాలు చేయడమే కాక అవకాశం ఉన్నంత వరకు వాటిని ఎన్నికలకు ముందే అమలు చేసి ప్రజలను మెప్పించేందుకు ప్రయత్నిస్తుంటాయి.

ఇప్పటికే డ్వాక్రా మహిళలకు మేలు చేయగా.రైతులకు లబ్ది చేకూర్చేందుకు ప్రయత్నిస్తోంది.

ఇక సామజిక వర్గాల విషయానికి వస్తే.అధికార పార్టీ టిడిపి… ‘జయహో బిసి’ పేరుతో.

రాజమండ్రిలో సభను నిర్వహించి ప్రధాన సామాజిక వర్గం బీసీలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించింది.

అలాగే ధర్మ పోరాట దీక్ష పేరుతో సెంటిమెంట్ రగులుస్తూ… పోరాటానికి కూడా దిగింది.ఇవన్నీ టిడిపికి విపరీతమైన మైలేజ్ తీసుకురావడంతో ప్రధాన ప్రతిపక్షమైన వైసిపి డిఫెన్స్ లో పడేసింది.

అందుకే ఎత్తులకు ఎత్తు వేసే విధంగా జనాల చూపును టిడిపి వైపు కాకుండా వైసిపి వైపు మల్లెలా పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు ఉండేలా జగన్ కొత్త స్కెచ్ వేసాడు దీనిలో భాగంగానే ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ తదితరులను పార్టీలో చేరేలా జగన్ ప్లాన్ చేశాడు.

ఈ పరిణామాలు వైసీపీలో తో పాటు ప్రజల్లో కూడా ఆసక్తి పెంచింది.అలాగే బీసీల్లో పట్టు పెంచుకునేందుకు ఏలూరులో ఆదివారం బీసీ సదస్సు నిర్వహించి ఆ సామాజిక వర్గాల తమ వైపు తిప్పుకునేందుకు జగన్ ప్రయత్నించారు.

ఏలూరులో బీసీ సదస్సు నిర్వహించడం వెనుక చాలా కారణాలే ఉన్నాయి.

గత ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాల్లో బీసీలు టిడిపికి మద్దతుగా నిలిచారు.

దీంతో పాటు కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కూడా పవన్ కళ్యాణ్ ప్రభావంతో టిడిపికి పడ్డాయి .ఇక ఎన్నికల అనంతరం నుంచి ఇప్పటి వరకు బీసీల్లో పట్టు పెంచుకునేందుకు వైసిపి శత విధాలుగా ప్రయత్నిస్తుంది.ముఖ్యంగా ఈ రెండు జిల్లాలు టార్గెట్ చేసుకుంటూ జగన్ రాజకీయం నడిపాడు.బీసీల మద్దతు పూర్తి స్థాయిలో ఉంటే అధికారం దక్కించుకోవడం ఏ మాత్రం కష్టం కాదని జగన్ ఒక అభిప్రాయానికి వచ్చాడు.

అందుకే ఏలూరు లో నిర్వహించిన బీసీ జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.రాజమండ్రిలో జయహో బీసీ పేరుతో టిడిపి నిర్వహించిన సదస్సులో చంద్రబాబు ఇచ్చిన హామీలకు మించిపోయేలా ఏలూరు సభలో జగన్ హామీలు ఇచ్చారు.

ఈ పరిణామాలు వైసిపికి బాగా కలిసి వచ్చేలాగా ఉన్నట్టు అర్థం అవుతుంది.అసలు ఈ సదస్సుకు ముందే బీసీల సమస్యల పై కింది స్థాయి నుంచి జగన్ సర్వే చేయించడం అసలు వారికి ఏమి అవసరం.తాము ఏ హామీ ఇస్తే వారి మద్దతు తమకు దక్కుతుంది అనే విషయాలపై పూర్తిస్థాయిలో తెలుసుకొని… ఆ మేరకు ఈ సదస్సులో హామీలు ఇచ్చాడు.జగన్ ఇచ్చిన హామీలను చూసుకుంటే….

బీసీ విద్యార్థులు చదువుకు ఖర్చు మొత్తం ప్రభుత్వం భరిస్తుందని, అలాగే ప్రతి మహిళకు సంవత్సరానికి 75 వేల రూపాయలు నాలుగు వేలు నాలుగు విడతలుగా ఉచితంగా అందిస్తామని ప్రకటించాడు.దాదాపు ఐదేళ్ల కాలంలో టిడిపికి బీసీలు ఎందుకు గుర్తు రాలేదని…? ఎన్నికల ముందే ఇటువంటి వాగ్దానాలు టీడీపీ చేయడం వెనుక రాజకీయం ప్రజలు అర్థం చేసుకోవాలని జగన్ గుర్తు చేశారు.ఏలూరులో నిర్వహించిన ఈ సదస్సు వైసిపి కి బాగా కలిసొచ్చినట్టుగానే కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube