తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు25, ఆదివారం 2024

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.02

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.36

రాహుకాలం: సా.4.30 ల6.00

అమృత ఘడియలు: మ.2.22 ల3.30

Advertisement

దుర్ముహూర్తం: సా.4.25 ల5.13

మేషం:

ఈరోజు కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి.నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు.

మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..

వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

Advertisement

వృషభం:

ఈరోజు దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.మిత్రుల నుంచి అవసరానికి ధనసహాయం లభిస్తుంది.నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

చేపట్టిన ప్రతి పనిలో పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి.విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి.

వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి.

మిథునం:

ఈరోజు ముఖ్యమైన పనులలో శ్రమపడ్డా ఫలితం ఉండదు.వ్యాపార వ్యవహారాలలో వ్యయప్రయాసలు అధికమవుతాయి.ఆర్థిక ఇబ్బందులు మరింత బాధిస్తాయి.

బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.

నిరుద్యోగులకు కొంత నిరాశ తప్పదు.

కర్కాటకం:

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి అధికమవుతుంది.ఆలయ దర్శనాలు చేసుకుంటారు.

చేపట్టిన పనులలో శ్రమ తప్పకపోవచ్చు.ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి.

వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

సింహం:

ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.సోదరులతో ఆస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి.పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

నిరుద్యోగులకు నూతన ఉద్యోగప్రాప్తి ఉన్నది.దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

వ్యాపార, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

కన్య:

ఈరోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.వృత్తి వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి.ఇంటాబయట ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి.

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.ఉద్యోగాలలో ఇతరులతో సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు.

తుల:

ఈరోజు ఇంటాబయట ఊహించని సమస్యలు కలుగుతాయి.నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది.వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు.దైవ చింతన పెరుగుతుంది.

వృశ్చికం:

ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

సన్నిహితుల నుండి శుభవర్తమానాలు అందుతాయి.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

ధనుస్సు:

ఈరోజు ముఖ్యమైన పనులలో శ్రమాధిక్యత అధికమవుతుంది.వృత్తి వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి.ఉద్యోగముల అదనపు పని భారం వలన ఆలోచనలు స్థిరంగా ఉండవు.

చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి.కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.

నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా పడతాయి.

మకరం:

ఈరోజు ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.నూతన వాహన యోగం ఉన్నది.వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.

ఆర్థిక పరిస్థితి ఆశాజనకం ఉంటుంది.నూతన వ్యక్తుల పరిచయాలు ఆనందం కలిగిస్తాయి.

ఇంటాబయట పరిస్థితులు అనుకూలిస్తాయి.

కుంభం:

ఈరోజు బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి.ధన పరంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి.అనుకున్న వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి.

సంతాన ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు.ఆర్థిక లావాదేవీలు మరింత మందగిస్తాయి.

వ్యాపారాలలో భాగస్వాములతో మాటపట్టింపులు ఉంటాయి.

మీనం:

ఈరోజు బంధు, మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు అధికమవుతాయి.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు అమలు చేయడం మంచిది కాదు.

ముఖ్యమైన పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు.ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

ఉద్యోగాలలో అంచనాలను అందుకోవడంలో విఫలమవుతారు.

తాజా వార్తలు