తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి19, బుధవారం 2025

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.22

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.28

రాహుకాలం: ఉ.12.00 ల1.30

అమృత ఘడియలు: వైశాఖ నక్షత్రం సామాన్యము.

Advertisement
Telugu Daily Astrology Prediction Telugu Rasi Phalalu March 19 Wednesday 2025, M

దుర్ముహూర్తం: ఉ.11.36 మ12.4

మేషం:

Telugu Daily Astrology Prediction Telugu Rasi Phalalu March 19 Wednesday 2025, M

ఈరోజు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి.సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

ఇకపై సినిమాలు ఆపేస్తారా... డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం ఇదే! 
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి 24, సోమవారం 2025

వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

Advertisement

వృషభం:

ఈరోజు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి.దీర్ఘకాలిక ఆరోగ్యసమస్యలు మరింత చికాకు కలిగిస్తాయి.ఆస్తి వివాదాలు పరిష్కారానికి చేసే ప్రయత్నాలలో అవరోధాలు కలుగుతాయి.

ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి.బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి.

వృత్తి, వ్యాపారాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.

మిథునం:

ఈరోజు ఆస్తి వివాదాల పరిష్కారానికి చేసే ప్రయత్నలలో చిన్నపాటి అవరోధాలు ఉంటాయి.కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.వ్యాపారాల్లో అంచనాలు అందుకుంటారు.

సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.ఉద్యోగమున హోదాలు పెరుగుతాయి.

కర్కాటకం:

ఈరోజు నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి.సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది.చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

సింహం:

ఈరోజు నూతన రుణాలు చేస్తారు.బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాలలో విభేదాలు కలుగుతాయి ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి.కొన్ని పనులు మధ్యలో వాయిదా పడతాయి.

ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి.

ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.

కన్య:

ఈరోజు వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు.ఇంటాబయట బాధ్యతలు పెరుగుతాయి.కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.

ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.వ్యాపారాలు కొంత మందగిస్తాయి.

ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.

తుల:

ఈరోజు ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

వృశ్చికం:

ఈరోజు చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.ఉద్యోగమున అధికారులతో చర్చలు సఫలం అవుతాయి.

దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది.వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి.

నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

ధనుస్సు:

ఈరోజు గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి.నిరుద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.వ్యాపారమున లాభాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

ఉద్యోగమున పని ఒత్తిడి నుండి కొంత ఉపశమనం లభిస్తుంది.రాజకీయ రంగాల వారికి అరుదైన అవకాశాలు లభిస్తాయి.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

మకరం:

ఈరోజు గృహమున కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు ఆచరణలో పెడతారు.ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగి ఊరట చెందుతారు.ముఖ్యమైన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.

వృథాఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది.మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

మకరం:

ఈరోజు సోదరుల నుండి ధన సహాయం అందుతుంది.సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.నూతన వ్యక్తులతో పరిచయాలు లాభాలు కలిగిస్తాయి.

కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.ధన పరంగా అవరోధాలు అధిగమిస్తారు.

చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి.

మీనం:

ఈరోజు నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు.ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

బంధుమిత్రులతో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీ ఆలోచనలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి.

తాజా వార్తలు