తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్3, మంగళవారం 2024

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.04

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.30

రాహుకాలం: సా.3.00 ల4.30

అమృత ఘడియలు: ఉ.6.20 ల7.33

Advertisement

దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12 రా10.46 ల11.36

మేషం:

ఈరోజు చిన్ననాటి మిత్రులను ఆగమనం ఆనందం కలిగిస్తుంది.నిరుద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి.కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు.

దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి.వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా సాగుతాయి.

శభాష్ చంద్రబాబు : బోటులో పర్యటనలు .. తెల్లవారుజాము సమీక్షలు
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్ 2, సోమవారం 2024

ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.

Advertisement

వృషభం:

ఈరోజు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.నిరుద్యోగులు నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు.మిత్రులతో దైవదర్శనం చేసుకుంటారు.

దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు.వ్యాపారమున ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారతారు.

నూతన వాహన యోగం ఉన్నది.

మిథునం:

ఈరోజు ఇంటాబయట కొన్ని సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి.ధన పరంగా చికాకులు తప్పవు.ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి.

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.దూరప్రయాణాలు వాయిదా వేయుట మంచిది.

వృత్తి వ్యాపారాలలో శుభవార్తలు అందుతాయి.ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది.

కర్కాటకం:

ఈరోజు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.పాతబాకీలు వసూలవుతాయి.ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి.వ్యాపారమున మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి.

సింహం:

ఈరోజు స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి.స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

చేపట్టిన పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి.వృధా ఖర్చులు పెరుగుతాయి.

ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలించవు.ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

కన్య:

ఈరోజు అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు.వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది.ముఖ్యమైన వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది.

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు.

తుల:

ఈరోజు కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు రకములుగా ఉంటాయి.ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.దైవచింతన పెరుగుతుంది.

సన్నిహితులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.వ్యాపారాలలో స్వల్ప లాభాలను అందుకుంటారు.

వృత్తి ఉద్యోగాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది.

వృశ్చికం:

ఈరోజు ఆస్తి తగాదాలు మరింత చికాకు కలిగిస్తాయి.ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి.

చేపట్టిన పనులలో శ్రమకు ఫలితం కనిపించదు.దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది.

నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి.

ధనుస్సు:

ఈరోజు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.వృత్తి వ్యాపారాలలో చిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి.

దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులను అధిగమిస్తారు.

మకరం:

ఈరోజు గృహ నిర్మాణ విషయంలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత విషయాలు చర్చిస్తారు.సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమవుతాయి.

విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి.వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

కుంభం:

ఈరోజు అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.చేపట్టిన పనులలో శ్రమకు ఫలితం కనిపించదు.సోదరులతో ఆస్తి వివాదాలు ఉంటాయి.

వృధా ఖర్చులు పెరుగుతాయి.కుటుంబ సభ్యుల నుంచి రుణ ఒత్తిడి పెరుగుతుంది.

ప్రయాణాలు వాయిదా వేస్తారు.వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

మీనం:

ఈరోజు దూరప్రయాణాలలో వాహనం ఇబ్బందులు ఉంటాయి.కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు తప్పవు.వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి.

చేపట్టిన పనులు మందగిస్తాయి.కొన్ని వ్యవహారాలు శ్రమతో గాని పూర్తి కావు.

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

తాజా వార్తలు