తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 10 గురువారం, 2020

ఈ రోజు పంచాంగం(Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6:04 సూర్యాస్తమయం: సాయంత్రం 6:32రాహుకాలం: మ.01:51 నుంచి మ.

3.25 వరకుఅమృత ఘడియలు: ఉ.10:08 నుంచి ఉ.11.54 వరకుదుర్ముహూర్తం: ఉ.10.13 నుంచి ఉ.11.03 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు కొత్త వ్యక్తులను కలుస్తారు.వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతారు.

ఆర్ధికంగా కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికి రోజు చివరికి మంచి ఫలితం ఉంటుంది.జీవిత భాగస్వామితో ఈరోజు ఆనందంగా గడుపుతారు.

వృషభం:

ఈరోజు అంతా ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆనందంగా గడుపుతారు.కొన్ని కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికి చురుకైన ఆలోచనలతో విజయాన్ని సొంతం చేసుకుంటారు.కొద్ది సమయం ధ్యానం చేస్తే మంచిది.

మిథునం:

మీ బంధువులతో ఎంతో ఆనందంగా గడుపుతారు.రోజు ప్రారంభంలో వత్తిడికి గురైనప్పటికి సంతోషంగా జీవిస్తారు.

Advertisement

భాగస్వామితో మీ వ్యాపారానికి సంబంధించిన ఆలోచనలను పంచుకొని ఆనందంగా గడుపుతారు.

కర్కాటకం:

ఈరోజు ఎవరైనా అప్పు అడిగితే అసలు ఇవ్వకండి.సమస్యలు వస్తాయ్.మానసికంగా ఇబ్బందులకు గురవుతారు.

మీకు వచ్చిన కష్టాన్ని ఇతరులతో పంచుకోలేరు.అందుకే కాసేపు ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత మీ సొంతం!

సింహం:

ఎప్పటి నుంచో పడుతున్న ఇబ్బందులు అన్ని ఈరోజు తీరిపోతాయి.మీ కుటుంబంతో ఆనందంగా గడుపుతారు.

ఆర్ధిక అభివృద్ధి ఉంటుంది.భాగస్వామికి మీకు మధ్య అపార్ధాలు దూరం అయ్యి ఆనందంగా ఉంటారు.

కన్య:

ఆ పోస్ట్ లు షేర్ చేసేది ప్రభాస్ కాదు.. పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్ వైరల్!
ఏడాదికి పైగా పాకిస్తాన్ లో మగ్గిపోయాం.. రియల్ తండేల్ కామెంట్స్ వైరల్!

ఈరోజు అంతా ఎంతో ఉల్లాసంగా సంతోషంగా ఉంటారు.అనారోగ్య సమస్యలు తీరి సంతోషంగా ఉంటారు.అంతేకాదు మీ ఆఫీస్ లో కూడా ఇన్నాళ్లు కష్టపడిన పనిని గుర్తించి ప్రశంసలు అందుకుంటారు.

Advertisement

ఆర్ధికంగా ఆనందంగా ఉంటారు.

తులా:

చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి.అప్పుడే ఆరోగ్యగంగా ఉంటారు.

ఆర్ధికంగా జాగ్రత్తగా ఉండాలి.డబ్బును చూసి ఖర్చు పెట్టుకోవాలి.

వైవాహిక జీవితంలో కొన్ని కష్టాలు వస్తాయ్ కానీ ఆలోచనలు, పెద్ద సలహాలు తీసుకొని పరిష్కరించుకోవాలి.

వృశ్చికం:

ఎన్ని సమస్యలు వచ్చిన మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.జాగ్రత్తగా ఉండాలి.అప్పుడే కష్టాల కడలి నుంచి బయటపడతారు.

కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు.నోటి దురుసు తగ్గించుకుంటే మీ పెద్దల వద్ద గౌరవంగా ఉంటారు.

ధనస్సు:

పాత మిత్రులను కలిసి సంతోషంగా ఉంటారు.భవిష్యత్తు కోసం కాస్త పొదుపు చేస్తారు.

ప్రియమైన వారి కోసం కొంత డబ్బును సమయాన్ని ఇస్తారు.జీవిత భాగస్వామితో పొదుపు గురించి చర్చించి మంచి ఆలోచనలతో ముందుకు అడుగులు వేస్తారు.

మకరం:

చెడు అలవాట్లకు దూరం అవుతే బాగుంటుంది.వాటి కారణంగా ఇంట్లో ఖర్చులు పెరుగుతాయి.పిల్లలకు సరైన సమయానికి సహాయం చెయ్యలేరు.

విద్యార్థులు మంచి చదువులో మంచి ఉత్తీర్ణత సాధిస్తారు.వ్యాపారాలలో మంచి లాభాలను చూస్తారు.

కుంభం:

ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందులు పడుతారు.కానీ పెద్దవారి సహాయంతో వాటి నుంచి బయటపడతారు.

ఇంటి అవసరాల కొరకు కొన్ని ఖర్చులు చేస్తారు.భాగస్వామితో గొడవలు పడుతారు.

అందుకే మాట్లాడే సమయంలో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది.

మీనం:

పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు.డబ్బును పొదుపు చేస్తారు.ఒకటికి రెండు సార్లు ఆలోచించి వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతారు.

జీవిత భాగస్వామితో ఆనందంగా సమయాన్ని గడుపుతారు.

తాజా వార్తలు