తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 30, శనివారం, 2021

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.56

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

36

రాహుకాలం: ఉ.09.00 నుంచి 10.30 వరకు

అమృత ఘడియలు: ఉ.04.00 నుంచి 06.00 వరకు

Advertisement

దుర్ముహూర్తం: ఉ.06.00 నుంచి 07.36 వరకు

ఈరోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు విద్యార్థులకు అనుకూలంగా ఉంది.సాయంత్రం సమయంలో మీ పార్ట్నర్ తో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి.

చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.కుటుంబ సభ్యులతో మీకు సంబంధించిన విషయాల సలహాలు తెలుసుకోవాలి.

వైరల్ : కొడుకు కోసం ఆ తండ్రి బిర్యానీతో పడిన కష్టం.. ఎమోషనల్ స్టోరీ..
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనే ? 

వృషభం:

Advertisement

ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.గొడవలతో సాగుతున్న మీ జీవితం ఈ రోజుటికీ గొడవలు సద్దుమణుగుతాయి.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు.

ఇతరులతో వాదనలకు దిగకండి.

మిథునం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొన్ని ముఖ్యమైన పనుల కోసం దూర ప్రయాణాలు చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కర్కాటకం:

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యుల నుండి శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకూడదు.

సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

సమయాన్ని కాపాడుకుంటారు.

సింహం:

ఈరోజు మీకు కొన్ని ఆటంకాలెదురవుతాయి.వీటిని ధైర్యంగా ఎదుర్కోవాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని పనులలో ఇతరుల సహాయం అందుతుంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మనశాంతి కోల్పోతారు.

సమయాన్ని వృథా చేయకూడదు.

కన్య:

ఈరోజు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.పిల్లలు పెళ్లిళ్ల గురించి ఆలోచనలు చేస్తారు.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

తులా:

ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టిన సక్రమంగా సాగుతుంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.కొన్ని వాదనలు దూరంగా ఉండాలి.

శత్రువుల జోలికి అస్సలు వెళ్ళకూడదు.కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

ఉద్యోగస్తులకు ఎన్నో లాభాలు ఉన్నాయి.

వృశ్చికం:

ఈరోజు మీరు మీ తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి బాగా చర్చలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.

ధనస్సు:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.కుటుంబ సభ్యులతో కలిసి కొంత సమయాన్ని గడుపుతారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

మకరం:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇతరులు అప్పుగా తీసుకున్న మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.అనవసరమైన విషయాలలో తలదూర్చకూడదు.

కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇతరులు మీకు ఆర్థిక సహాయం చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాలను పంచుకోండి.

దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.

మీనం:

ఈరోజు మీరు పనిచేసే చోట కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.వాటిని పట్టించుకోకుండా మీ పనులు ఏంటో చూసుకోవాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

సమయాన్ని కాపాడుకోవాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవమున్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

తాజా వార్తలు