తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 24, ఆదివారం, 2021

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.56

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

36

రాహుకాలం: మ.04.00 నుంచి 06.00 వరకు

అమృత ఘడియలు: మ.012.00 నుంచి 02.00 వరకు

Advertisement

దుర్ముహూర్తం: మ.04.25 నుంచి 05.13 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

బయట సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.తోబుట్టువులతో వాదనలకు దిగకండి.

చిరు, బాలయ్య రిజెక్ట్ చేసిన డైరెక్టర్ కు నాగార్జున ఛాన్స్ ఇస్తారా.. ఏమైందంటే?
పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?

వృషభం:

Advertisement

ఈరోజు మీరు చేసే పనిలో కొన్ని ఆటంకాలెదురవుతాయి.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.ఇతరులను ఎక్కువగా నమ్మకూడదు.

మీ వ్యక్తిగత విషయాలు అన్ని బయటపెడతారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

మిథునం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.అనుకోకుండా మీ ఇంటికి బంధువుల రాకతో మరింత ఇబ్బంది పడతారు.ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.

ఆరోగ్యం అసలు బాగోదు.కొన్ని ఇబ్బంది పెట్టే విషయాల నుండి దూరంగా ఉండాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు సమస్యలు కొని తెచ్చుకుంటారు.దీనివల్ల భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకోకుండా మీ స్నేహితులను కలవడం వల్ల సహాయం కోరుకుంటారు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.సమయాన్ని కాపాడుకోవాలి.

సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.పెద్ద వాళ్ళతో మాట్లాడే ముందు గౌరవించాలి.కొన్ని పనులు వాయిదా పడే అవకాశం ఉంది.

దీనివల్ల నిరుత్సాహం చెందుతారు.ప్రయాణాలు చేయడం వల్ల నూతన పరిచయాలు ఏర్పడతాయి.

ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

కన్య:

ఈరోజు మీరు ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.తొందరపడి సొంత నిర్ణయాలు తీసుకోకూడదు.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.మీరు పనిచేసే చోట అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

తులా:

ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.

ఈరోజు సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు అందుకుంటారు.

వృశ్చికం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాలలో తలదూర్చడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో మీ వాదనలు వినిపించాలి.దానివల్ల కాస్త మనశ్శాంతి ఉంటుంది.

శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.లేదంటే వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది.

ధనస్సు:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొత్త పనులు ప్రారంభిస్తారు.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.

సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేయకండి.కొన్ని దూరప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

నిరుద్యోగులు ఉద్యోగ కోసం ప్రయత్నించాలి.

మకరం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

కుంభం:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.మీ ఇంటికి బంధువులు వస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఇతరులకు సహాయం చేస్తారు.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కొన్ని ప్రయాణాలు చేస్తారు.కొత్త రంగాల్లోకి అడుగు పెడతారు.

సమయాన్ని అసలు వదులుకోరు.మీరు పనిచేసే చోట లాభాలు ఉన్నాయి.

తాజా వార్తలు