తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి12, మంగళవారం 2024

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.27

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.26

రాహుకాలం: మ.3.00 ల4.30

అమృత ఘడియలు: సా.5.15 ల5.45

Advertisement
Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 12 Tuesday 2024, Daily Astr

దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12 రా.10.46 ల11.36

మేషం:

Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 12 Tuesday 2024, Daily Astr

ఈరోజు ఇంట బయట పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రహారాలు ఉండవు.ఇతరులకు ధనపరంగా మాట ఇచ్చే విషయంలో కొంత ఆలోచించి ముందుకు సాగడం మంచిది.విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.

దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

చిరు, బాలయ్య రిజెక్ట్ చేసిన డైరెక్టర్ కు నాగార్జున ఛాన్స్ ఇస్తారా.. ఏమైందంటే?
పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?

వృషభం:

Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 12 Tuesday 2024, Daily Astr
Advertisement

ఈరోజు ముఖ్యమైన పనులలో తొందరపాటు మంచిది కాదు.దైవ సేవా కార్యక్రమాలకు ధన వ్యయం చేస్తారు.చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది నిరుద్యోగులకు కొంత అనుకూలత వాతావరణం ఉంటుంది.

మిథునం:

ఈరోజు పాత బాకీలు వసూలు అవుతాయి కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ పడతారు.సమాజంలోకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అందరిని ఆకట్టుకొంటారు.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

కర్కాటకం:

ఈరోజు సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు అందుతాయి.వ్యాపారాలు విస్తరిస్తారు.నిరుద్యోగ సమస్యలు పరిష్కారమౌతాయి.

ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి.గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి.

ఆప్తుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు.

సింహం:

ఈరోజు ఇంట బయట కొందరి ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది.వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు.ఆర్ధిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి.

ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు.

కన్య:

ఈరోజు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులకు చేయవలసి వస్తుంది.దూరప్రయాణ సూచనలు ఉన్నవి.

దైవ సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు.వృత్తి ఉద్యోగాలు కొంత మందకొడిగా సాగుతాయి.

కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

తుల:

ఈరోజు ఉద్యోగాలలో అధిక శ్రమతోకానీ పనులు పూర్తి కావు నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి.దూర ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు.వ్యాపారాల్లో నూతన విధానాలు అమలుచేస్తారు.

ఉద్యోగమున సహోద్యోగులతో వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది.

వృశ్చికం:

ఈరోజు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.మిత్రుల నుండి ఆశించిన ధన సహాయం పొందుతారు.

చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.వృత్తి ఉద్యోగమున ఆశించిన మార్పులు ఉంటాయి.

కుటుంబ సమస్యలు రాజీ చేసుకుంటారు.

ధనుస్సు:

ఈరోజు వృత్తి ఉద్యోగాలలో అధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి.ధన పరంగా ఒడిదుడుకులు అదికమౌతాయి.దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి కొంత పెరుగుతుంది.

దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

నూతన ఋణ ప్రయత్నాలు చెయ్యకపోవడం మంచిది.

మకరం:

ఈరోజు కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది.నిరుద్యోగులకు అధికారుల అండదండలతో నూతన అవకాశాలు పొందుతారు.దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.వ్యాపారాలు విస్తరించి నూతన లాభాలు అందుకుంటారు.

కుంభం:

ఈరోజు ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.వృధా ఖర్చులు విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి.నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

దైవ చింతన పెరుగుతుంది.వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అనుకుంలించవు.

నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

మీనం:

ఈరోజు నూతన కార్యక్రమాలు ప్రారంభించక పోవడం మంచిది.సోదరులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.ఇంటా బయట మీ మాటకు విలువ తగ్గుతుంది.

జీవిత భాగస్వామితో అకారణంగా మాటపట్టింపులు ఉంటాయి.వ్యాపార వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి.

వృత్తి ఉద్యోగాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.

తాజా వార్తలు