తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 24, సోమవారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.58

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

30

రాహుకాలం:ఉ.7.30 ల9.00 వరకు

అమృత ఘడియలు: ఉ.9.00 ల10.30 మ 3.40 సా4.40.

Advertisement

దుర్ముహూర్తం:ఉమ.12.47 ల1.38 ల3.20 సా4.11

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచించకండి.కొన్ని దూర ప్రయాణాలు మీకు ఎంతో అనుకూలంగా ఉంటాయి.

కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.మీరు పని చేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

ఆ పోస్ట్ లు షేర్ చేసేది ప్రభాస్ కాదు.. పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్ వైరల్!
ఏడాదికి పైగా పాకిస్తాన్ లో మగ్గిపోయాం.. రియల్ తండేల్ కామెంట్స్ వైరల్!

వృషభం:

Advertisement

ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూరప్రయాణాలు చేసేటప్పుడు ఇతరులకు మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది.

చాలా సంతోషంగా ఉంటారు.

మిథునం:

ఈరోజు మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.ఆర్థిక లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.

మీ కుటుంబ సభ్యులతో వాదనాలకు దిగకండి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలి.

బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

కర్కాటకం:

ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి.దూరప్రాంతపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.

భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు.

సింహం:

ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మీరంటే గిట్టని వారు మీ విషయాలు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

కన్య:

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచించాలి.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.

మీ స్నేహితులతో వ్యక్తిగత విషయాలను పంచుకోకపోవడం మంచిది.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

తులా:

ఈరోజు మీరు అనుకోకుండా దూర ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించండి.మీ కుటుంబ సభ్యులతో వాదనాలకు దిగకండి.

కొన్ని సొంత నిర్ణయాలు తీసుకునే ముందు కాస్త ఆలోచించడం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో లాభాలు అందుకుంటారు

వృశ్చికం:

ఈరోజు మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.

వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీరు పని చేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కొందరు ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.

ధనస్సు:

ఈరోజు మీరు కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండటమే మంచిది.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.మీ కుటుంబ సభ్యులతో వాదనాలకు దిగే అవకాశం ఉంది.

మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన మీ కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది.

మకరం:

ఈరోజు మీరు మీ స్నేహితులతో కలిసి దైవదర్శనాలు వంటి దూర ప్రయాణాలు చేస్తారు.ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

కుంభం:

ఈరోజు మీరు దూరపు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.అది మీ మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.నూతన వస్తు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి ఈ రోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.

మీనం:

ఈరోజు మీరు కొన్ని కొత్త పనులను ప్రారంభించడానికి ఎంతో అనుకూలంగా ఉంది.మీరంటే గిట్టని వారు మీ విషయాలు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.ఇతరుల మాటలు అస్సలు పట్టించుకోకండి.

అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.

తాజా వార్తలు