భారతదేశంలో ప్రస్తుతం ఎండాకాలం కొనసాగుతుండగా విద్యార్థులందరూ వేసవి సెలవులు పొందారు.ఈ నేపథ్యంలో కుటుంబాలు ప్రయాణాలను ప్లాన్ చేసుకుంటున్నారు.
వారిలో చాలామంది ట్రైన్ జర్నీనే ( Train Journey )ఎంపిక చేసుకుంటున్నారు.అయితే ట్రైన్‌లో ప్రయాణించాలనుకునే వారు ఒక ఫీచర్‌ని సద్వినియోగం చేసుకొని మామూలు క్లాస్ టికెట్‌తో ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు.
వారు స్లీపర్ క్లాస్ టికెట్ బుక్( Sleeper Class Ticket Book ) చేసుకున్నా ఏసీ భోగిలో ప్రయాణించే అవకాశం ఉంది.అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
తక్కువ కాస్ట్‌తోనే ఏసీ కోచ్( AC Coach )లో ప్రయాణం చేయాలనుకునే ప్యాసింజర్లు రైలు టికెట్లు బుక్ చేసే సమయంలోనే ఆటో అప్‌గ్రేడేషన్ అనే ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.నిజానికి భారతీయ రైల్వే ఈ ఫీచర్‌ను చాలా కాలం క్రితమే అందుబాటులోకి తెచ్చింది.
కానీ దీని గురించి చాలా తక్కువ మందికి తెలుసు.దీన్ని ఎలా వాడుకోవాలో కూడా చాలామందికి ఐడియా లేదు.
నిజానికి గతంలో ప్రయాణికులు ఏ కోచ్‌లో బెర్త్ కావాలనుకుంటే అందులోనే బెర్త్ దొరికేది ఒకవేళ లేకపోతే టికెట్ క్యాన్సిల్ అయ్యేది.
దీనివల్ల ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడేవారు.అందుకే ఇండియన్ రైల్వేస్ ఆటో అప్‌గ్రేడేషన్ ఫీచర్( Indian Railways Auto Upgradation Feature ) తీసుకొచ్చింది.ఈ ఫీచర్ ఉపయోగించుకున్న వారు తాము టికెట్ బుక్ చేసుకున్న కోచ్‌లో ఖాళీ బెర్త్ దొరకకపోతే.
అంతకన్నా హయ్యర్ కోచ్‌లోకి వెళ్లి కూర్చోవచ్చు.అది కూడా ఆ హయ్యర్ బోగీలో ఏదో ఒక బెర్త్ ఖాళీగా ఉండాలి.
సాధారణంగా ఈ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుని స్లీపర్ క్లాస్ టికెట్ తీసుకున్న వారు అక్కడ బెర్త్ దొరకకపోతే థర్డ్ క్లాస్ ఏసీలోకి వెళ్లి కూర్చోవచ్చు.థర్డ్ క్లాస్ ఏసీ టికెట్ తీసుకున్న వారికి సీట్ దొరక్కపోతే వారు సెకండ్ క్లాస్ ఏసీకి, సెకండ్ క్లాస్ ఏసీ టికెట్ తీసుకున్న వారికి సీటు దొరక్కపోతే ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీలోకి వెళ్లి కూర్చోవచ్చు.అయితే ముందుగా ఎవరు ఈ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటారో వారికే హయ్యర్ కోచ్‌లో ప్రయాణించే అవకాశాలు ఉంటాయి.