అవకాశాల కోసం బాగానే కష్టపడుతున్న బిగ్ బాస్ బ్యూటీ... కానీ....

తెలుగులో మాయ అనే చిత్రం ద్వారా సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన హీరోయిన్ "నందిని రాయ్" తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.

 అయితే ఈమె అత్యంత కొద్దీ కాలంలోనే మంచి పాపులారిటీ సంపాదించిన "బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో" రెండవ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది.

  అంతేగాక పలు కన్నడ, తమిళ చిత్రాలలో నటించే అవకాశం కూడా దక్కించుకుంది.అయితే ఈ మధ్య కాలంలో నందిని రాయ్ పలు ప్రముఖ ఫోటోషూట్ సంస్థలు నిర్వహిస్తున్న ఫోటోషూట్ కార్యక్రమాలలో పాల్గొంటూ తన ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా షేర్ చేస్తోంది.

దీంతో నందిని రాయ్ అందానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. అంతేగాక హీరోయిన్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు మీలో ఉన్నప్పటికీ ఎందుకు సినిమా అవకాశాలు దక్కించుకోవడంలో విఫలమవుతున్నారని అంటూ కామెంట్లు చేస్తున్నారు.

  దీంతో నందిని రాయ్ కి సోషల్ మీడియా మాధ్యమం అయినటువంటి ఇంస్టాగ్రామ్ ఖాతాలో రోజురోజుకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతోంది.కాగా ఇటీవలే నందిని రాయ్ ప్రముఖ దర్శకుడు కరుణ కుమార్  దర్శకత్వం వహించిన మెట్రో కథలు అనే ఈ చిత్రంలో నటించింది.

Advertisement

 ఈ చిత్రంలో కొంతమేర నందిని రాయ్ బోల్డ్ తరహా పాత్రలో కనిపించింది.కాగా ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ  ప్లాట్ ఫారం అయినటువంటి ఆహా లో విడుదలైంది.

కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?
Advertisement

తాజా వార్తలు