బిగ్‌ బాస్‌ సీజన్ 5 మరో కీలక అప్‌డేట్‌ లీక్‌.. రచ్చ రంబోలా

తెలుగు బిగ్‌ బాస్ సీజన్ 5 అనధికారికంగా మొదలు అయ్యింది.

గత సీజన్ లో మాదిరిగానే ఈ సీజన్ లో కూడా కంటెస్టెంట్స్ ను క్వారెంటైన్ కు పంపించేందుకు ఏర్పాట్లు జరిగాయి.

ఇప్పటికే కంటెస్టెంట్స్ అందరికి కూడా మొదటి మరియు రెండవ డోసు కరోనా వ్యాక్సిన్‌ ను ఇవ్వడం జరిగింది.వేయించుకోని వారికి స్వయంగా స్టార్‌ మా మరియు బిగ్‌ బాస్ నిర్వాహకులు వేయించారు.

బిగ్ బాస్ లో గత సీజన్ లో ఎలా అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నారో అలాగే ఈసారి కూడా తీసుకుంటున్న విషయం తెల్సిందే.కరోనా వ్యాక్సిన్‌ ను అందరు తీసుకున్నా కూడా ఏమాత్రం ఆందోళన లేకుండా ప్రతి ఒక్కరి విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ వారిని క్వారెంటైన్‌ కు పంపించడం జరిగింది.

గత సీజన్ లో క్వారెంటైన్‌ లో ఉన్న ఒక కంటెస్టెంట్ కు కరోనా వచ్చింది.ఆ తర్వాత క్యూర్‌ అయ్యి మళ్లీ అతడు హౌస్‌ లో అడుగు పెట్టాడు.ఇక ఈ సీజన్‌ విషయానికి వస్తే కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత వెంటనే మొదలు పెట్టాలనుకున్నారు.

Advertisement

కాని థర్డ్‌ వేవ్‌ అంటూ ప్రచారం జరగడం వల్ల బిగ్‌ బాస్ సీజన్‌ 5 లేట్‌ అయ్యింది.ఎంత లేట్‌ అయినా కూడా గత సీజన్ సమయం కంటే మరీ ఆలస్యం అయితే కానివ్వడం లేదు.

బిగ్‌ బాస్‌ సీజన్‌ 5 కు సంబంధించిన పలు విషయాలు ఇప్పటి వరకు ట్రెండ్ అయ్యాయి.తాజాగా మరో విషయం ఈ సీజన్ లో అత్యధిక పారితోషికం తీసుకుని ఎంట్రీ ఇవ్వబోతున్నది షన్ముక్‌ జశ్వంత్‌.

ఇతడు ప్రస్తుతం యూత్‌ లో హీరోగా ఉన్నాడు.మంచి ఎంటర్‌ టైన్ మెంట్‌ ను అందించడంతో పాటు అన్ని విధాలుగా ఇతడు షో కు హైలైట్ గా నిలుస్తాడు అనే ఉద్దేశ్యంతో చివరి వరకు అతడిని హౌస్ లో ఉంచేలా.

అలాగే అతడికి లవ్ ట్రాక్ ను కూడా సెట్‌ చేసినట్లుగా తెలుస్తోంది.

శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్!
Advertisement

తాజా వార్తలు