అందుకే రోజా ని బెస్ట్ కమెడియన్ అన్నాను...

తెలుగు సినిమా పరిశ్రమలో నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ "మెగా బ్రదర్ నాగబాబు" గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అయితే నటుడు నాగబాబు నిర్మాతగా ఒకప్పుడు ఆరెంజ్, రుద్రవీణ, బావగారు బాగున్నారా, నా పేరు సూర్య, త్రినేత్రుడు, ఇలా దాదాపు పదికి పైగా చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు.

అంతేగాక 150కి పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో కనిపించాడు.అలాగే ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయిన ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షోలో కూడా కొంతకాలం పాటు నాగబాబు జడ్జీ గా వ్యవహరించాడు.

కానీ పలు అనివార్య కారణాల వల్ల అనుకోకుండా నాగబాబు ఈ షో నుంచి జడ్జిగా తప్పుకున్నాడు.ఆ తరువాత అదిరింది షోలో జడ్జిగా వ్యవహరించినప్పటికీ ఈ షోల కూడా ఇటీవలే ఆగిపోయింది.

కాగా ఈ మధ్య నాగబాబు సోషల్ మీడియా మాధ్యమాలలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు బాగానే టచ్ లో ఉంటున్నాడు.

Advertisement

దీంతో ఇటీవలే నాగబాబు కొందరు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చాడు.అయితే ఇందులో భాగంగా ఓ నెటిజన్ మీకు జబర్దస్త్ కామెడీ షోలో నచ్చిన కమెడియన్ ఎవరని.? ప్రశ్నించగా నాగబాబు ఏకంగా రోజా ఫోటో ని చూపిస్తూ సమాధానం చెప్పాడు.దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా మాధ్యమాలలో హాట్ టాపిక్ గా మారింది.

అంతేగాక కొంతమంది మీమ్ క్రియేటర్లు నటి రోజాపై నాగబాబు చేసిన ఈ కామెంట్స్ ని తెగ వైరల్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.దీంతో తాజాగా మరోమారు నాగబాబు ఈ విషయంపై స్పందించాడు.

ఇందులో భాగంగా ఈ మధ్య కాలంలో నటి రోజా కూడా జబర్దస్త్ షోలో రోజా అప్పుడప్పుడూ పంచులు, సెటైర్లు వేస్తూ బాగానే నవ్విస్తుందని అందువల్లనే ఆమెని బెస్ట్ కమెడియన్ అన్నానని అంతే తప్ప అందులో ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశాడు.అంతేగాక తమ మీమ్స్ మరియు ఫన్నీ ఫోటోలతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న మీమ్స్ క్రియేటర్స్ కి తాను ఎప్పుడూ సపోర్ట్ చేస్తానని చెప్పుకొచ్చాడు.

ఈ విష్యం ఇలా ఉండగా ప్రస్తుతం నాగబాబు పలు టాలీవుడ్ చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నాడు.అలాగే ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రంలో నాగబాబు ఫ్యాక్షనిస్ట్ పాత్రలో నటిస్తున్నాడు.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే కళ్ళ‌జోడుకు మీరు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు!
కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?

ఇటీవలే ఈ చిత్తరంలో తన పాత్రకి సంబందించిన ఫోటోని షేర్ చేసాడు.

Advertisement

తాజా వార్తలు