'టాలీవుడ్'లో నటించడం తన అదృష్టమంటున్న హీరోయిన్.. ఎవరో తెలుసా?

ప్రముఖ నిర్మాణ సంస్థ అయినా వారాహి సంస్థ నిర్మిస్తున్న సినిమా తెల్లవారితే గురువారం ఈ సినిమాను డైరెక్టర్ మణికాంత్ దర్శకత్వం వహించారు.

ఇక ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదల కాగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఈ సినిమాలో సింహ కోడూరి, మిషా నారంగ్ లు నటీనటులు గా నటించారు.ఇక ఈ సినిమా మిషాకు మొదటి సినిమా కావడంతో తాను ఒక మంచి నిర్మాణ సంస్థ చేయడం అదృష్టమని తెలిపింది.

అంతేకాకుండా కొన్ని విషయాలు కూడా పంచుకుంది మిషా.హరియాణా లోని కురుక్షేత్ర తన స్వస్థలం అని కానీ ఈ సినిమాలో నటించడానికి ముంబై లో ఉంటున్నానని తెలిపింది.ఆడిషన్స్ ఇస్తూ అవకాశాల కోసం ఆమె ఎదురు చూస్తుండగా తెల్లవారితే గురువారం సినిమాలో అవకాశం వచ్చిందట.2019లో మిస్సింగ్ అనే సినిమాలో తనకు అవకాశం రాగా కరోనా సమయం వల్ల షూటింగ్ వాయిదా పడిందట.ఇక ఆ సమయంలోనే వారాహి సంస్థ తన ప్రొఫైల్ చూసి తనను సంప్రదించారని తెలిపింది.

ఇక వాళ్ళు కథ వినిపించేటప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా ఫీలయ్యిందట‌.

Advertisement

ఇక ఈ సినిమా టైటిల్ ప్రకారం తెల్లవారితే గురువారం అనగా పెళ్లి జరగబోతున్న క్రమంలో అనుకోకుండా ఎదురయ్యే సమస్యలే ఈ సినిమా అని తెలిపింది.ఇక ఈ వారాహి వంటి ప్రముఖ నిర్మాణ సంస్థ తో పనిచేయడం తనకు చాలా ఆనందంగా ఉందని తెలిపింది.ఇక ఈ సినిమాలో తన సహ నటుడు హీరో తో మంచి అనుబంధం ఏర్పడిందని, డైరెక్టర్ సీన్స్ వివరించే విధానం బాగుందని తెలిపింది.

ఇక తనకు తెలుగు భాష కొత్త కావడంతో తనకు వచ్చిన సందేహాలన్నీ తీర్చేవారట.ఇదిలా ఉంటే ఆమెకు ఆర్మీ, ఐఏఎస్ వంటి పాత్రల్లో నటించాలని ఆసక్తి ఉందట.

ఇక ఆమెకు కన్నడ, తమిళం సినిమాలో కూడా అవకాశాలు వస్తున్నాయని ఇక తెలుగులో తన మొదటి సినిమాకే ప్రాధాన్యమని చెప్పుకొచ్చింది.

వైసీపీ కార్యాలయం కూల్చివేత పై జగన్ ఏమన్నారంటే ? 
Advertisement

తాజా వార్తలు