తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పదవి చేపట్టిన నాటి నుండి పార్టీలో అనేక అంతర్గత విభేదాలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే.కాంగ్రెస్ పార్టీలో ఎప్పటినుండో ఉంటున్న సీనియర్లు.
రేవంత్ నాయకత్వం పై పలు సందర్భాలలో అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది.తాజాగా కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ కమిటీలను ప్రకటించిన తర్వాత… టీ కాంగ్రెస్ సీనియర్ లు మరింత నిరసన గళాలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నారు.
తాజాగా కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ లు సమావేశం కావడం జరిగింది.
ఈ సమావేశానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, మధుయాష్కి గౌడ్, జగ్గారెడ్డి హాజరయ్యారు.
సమావేశం అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.పీసీసీ కమిటీల ఏర్పాటులో తమ ప్రమేయం లేదని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులపై గత కొంతకాలంగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతుంది.దీని వెనకాల కుట్ర దాగి ఉంది.అంటూ అనుమానం వ్యక్తం చేశారు.పార్టీలో తనని కలిసే వారికి సైతం న్యాయం చేయలేకపోతున్నానని ఈ విషయంలో తీవ్ర ఆవేదన కలుగుతుందని భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు.