గవర్నర్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతల కౌంటర్.. ఏమన్నారంటే?

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు కీలక మార్పులతో పెద్ద ఎత్తున హాట్ హాట్ గా మారుతున్న పరిస్థితి ఉంది.ప్రస్తుతం రాష్ట్ర గవర్నర్ తాజాగా అమిత్ షాను కలిసిన అనంతరం మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన పరిస్థితి ఉంది.

 Trs Leaders Counter On Governor Tamilisi Remarks Details ,trs Party, Amitsha, Go-TeluguStop.com

ఒక మహిళా గవర్నర్ గా తనను అవమానపరుస్తున్నారని, ప్రోటోకాల్ విషయంలో గవర్నర్ ను చాలా వరకు నిర్లక్ష్యం  వహిస్తున్నారని నాకు తెలంగాణ ప్రజలపై ఎలాంటి కోపం లేదని తనకున్న విశేష అధికారాలను ఇంకా నేను పూర్తి స్థాయిలో వినియోగించడం లేదని ప్రోటోకాల్ నిబంధనలను ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకొనే అధికారం తనకు ఉందని కాని నేను అలా చేయడం లేదని యూనివర్సిటీలను ఉద్దేశ్యపూర్వకంగానే నిర్వీర్యం చేస్తున్నారని గవర్నర్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా వైరల్ గా మారాయి.

అయితే గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై నిన్న కెటీఆర్, నేడు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కౌంటర్ ఇవ్వడంతో మరొక్క సారి రాజకీయ వేడి రాజుకుందని చెప్పవచ్చు.

తాజాగా నేడు నల్లజెండా ఎగరవేతల సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.గవర్నర్ బీజేపీ ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని, 20 నిమిషాల ముందు చెబితే ఎలా అధికారులు అందుబాటులో ఉండగలరని ముందుగా చెబితే అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటారని బీజేపీ ప్రతినిధిలా మాట్లాడుతుంటే ఎలా అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది.

Telugu @ktrtrs, Amitsha, Ktr, Modi, Tamilisi, Telangana-Political

అయితే ఇంకా మరికొంత మంది టీఆర్ఎస్ నేతలు కూడా గవర్నర్ వ్యాఖ్యలపై స్పందించే అవకాశం కనిపిస్తోంది.అయితే గవర్నర్ మాత్రం నన్ను ఎవరూ అదుపు చేయలేరని నాకున్న అధికారాలని తప్పనిసరిగా ఉపయోగించుకుంటానని వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి ఉంది.ఏది ఏమైనా రానున్న రోజుల్లో గవర్నర్ కు, ప్రభుత్వానికి మధ్య భీకర వాతావరణం కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube