కసరత్తు పూర్తి నేడే బిజెపి ఫస్ట్ లిస్ట్ !

తెలంగాణ లో జిహెచ్ఎంసి ఎన్నికల తర్వాత వచ్చిన ఊపును కొనసాగించడంలో తెలంగాణ బిజెపి( Telangana BJP ) కొంత వెనకబడింది .

కాంగ్రెస్ బారాస లు పోటాపోటి గా తలపడుతుంటే భాజాపా మాత్రం రేసులో కొంత వెనకబడిన వాతావరణం కనిపిస్తుంది .

అయితే హంగ్ వస్తే మాత్రం చక్రం తిప్పడానికి బిజెపి అన్నీ ఏర్పాట్లు చేసుకుంటుంది.దానికి తగ్గట్లుగానే క్రియాశీలక స్థానాలలో గెలుపు గుర్రాలను మొహరించే విధంగా బిజెపి ప్రయత్నాలు మొదలుపెట్టింది .ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించిన పూర్తి స్తాయి కసరత్తు ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జ్ ప్రకాష్ జవదేవకర్ నివాసంలో జరిగినట్టుగా తెలుస్తుంది .

రాష్ట్ర ఇన్చార్జీలు తరుణ్ చుగ్ , సునీల్ బన్సల్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ రాజేంద్ర తదితరులు బేటీ అయ్యి చర్చించినట్టుగా వార్తలు వస్తున్నాయి .ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో( JP Nadda )ను పలుమార్లు కమిటీ సమావేశం అయినట్టు గా తెలుస్తుంది.తెలంగాణతో పాటు రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కూడా అభ్యర్థులను ప్రకటించడానికి భాజపా కసరత్తు మొదలుపెట్టింది.

అయితే మధ్యప్రదేశ్ ,రాజస్థాన్లో గెలవడానికి పూర్తిస్థాయి అవకాశాలు ఉండడంతో మరింత ఎక్కువ సమయం తీసుకోవడానికి భాజపా అధిష్టానం చూస్తునట్టుగా తెలుస్తుంది.

Advertisement

తెలంగాణలో బలంగా ఉన్న కొన్నిచోట్ల, విజయవకాశాలను ప్రభావితం చేసే కొన్ని చోట్ల మాత్రం కీలక అభ్యర్థులను ఇప్పటికే ఫైనల్ చేసిన భాజపా ఎట్టి పరిస్థితులలోనూ హంగ్ వస్తే మాత్రం చక్రం తిప్పడానికి కార్యాచరణ రెఢీ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఇటీవల జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో కిషన్ రెడ్డి భేటీ తర్వాత ఆ పార్టీతో పొత్తు ఉంటుందన్న విశ్లేషణలు బయలుదేరగా, దానికి ఈరోజు అభ్యర్ధుల ప్రకటన తో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.జనసేన( Janasena )తో కలిసి వెళ్తే పార్టీ పై ఆంధ్రా ముద్ర పడే అవకాశం ఉందన్న ఆలోచనలు కూడా తెలంగాణ నాయకులను పట్టిపీడిస్తున్నట్లుగా తెలుస్తుంది.

అయితే గతంలోనూ భారతీయ రాష్ట్ర సమితి అభ్యర్థికి జనసేన మద్దతు ఇచ్చి ఉండడంతో ఇప్పుడు ప్రాంతీయత అంత పెద్ద సమస్య కాదని కలిసి వచ్చే అన్ని పార్టీలను కలుపుకుపోవాలని మరి కొంతమంది సూచిస్తున్నట్లుగా తెలుస్తుంది.ఏది ఏమైనా ఈరోజు అభ్యర్థుల ప్రకటనతో బిజేపి స్టాండ్ పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.

Advertisement

తాజా వార్తలు