బిగ్ బాస్ నాన్ స్టాప్.. మిత్ర కోసం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కూడా ఔట్.. ఈసారి ఎవరంటే?

బిగ్ బాస్ షోలో పరిస్థితులు ఇప్పుడు ఏ విధంగా ఉంటాయో చెప్పడం చాలా కష్టం.

అంతేకాకుండా మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడు అన్నట్టు బిగ్ బాస్ హౌస్ లో పరిస్థితులు ఊహించని విధంగా మారిపోతూ ఉంటాయి.

మరీ ముఖ్యంగా ఎలిమినేషన్ విషయంలో వీక్షకులు అనుకున్నట్టుగా ఇప్పుడు జరగదు.బిగ్ బాస్ టీం తో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు ఎలిమినేషన్ లు జరుగుతాయి అనేది ప్రధాన ఆరోపణ.

ఇకపోతే బిగ్ బాస్ షో చూస్తుండగానే ఇప్పటికే నాలుగు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది.ఇక ఐదవ వారం ఎలిమినేషన్ కూడా రానే వచ్చేసింది.

దీంతో ఈ సారి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్లిపోతున్నారు అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే ఈసారి బిగ్ బాస్ హౌస్ లో ఐదవ వారం షాకింగ్ ఎలిమినేషన్ జరగబోతోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement
Tejaswi Madivada May Out Of The Bigg Boss House Details, Tejaswi Madivada, Bigg

బిగ్ బాస్ హౌస్ లో ప్రతివారం జరిగే ఎలిమినేషన్ లో ఎప్పుడు కాంట్రవర్సీ లకు దారి తీస్తూనే ఉంటాయి అన్న విషయం తెలిసిందే.ఇప్పటికే మొదటివారం ముమైత్ ఖాన్, రెండో వారం శ్రీ రాపాక, మూడవ వారం ఆర్జె చైతూ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.

నాలుగో వారం సరయు బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయింది.

Tejaswi Madivada May Out Of The Bigg Boss House Details, Tejaswi Madivada, Bigg

ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ ఓటీటీ లో 5వ వారం ఎలిమినేషన్ లో భాగంగా ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.కబిగ్ బాస్ ఐదవ వారంలో ఎలిమినేషన్ లో భాగంగా మిత్రశర్మ ఎలిమినేట్ అవుతుంది అని అందరూ భావించారు.కానీ హౌస్ నుంచి ఐదో వారం తేజస్వి ఎలిమినేట్ కానుంది అని సమాచారం.

ఒకవేళ ఐదో వారం తేజస్వి ఎలిమినేట్ అయితే తప్పకుండా అది షాకింగ్ ఎలిమినేషన్ అవుతుంది.ఎందుకంటే గత సీజన్లో మాదిరి తప్పులు చేయకుండా జాగ్రత్త పడుతూ ఆడుతోంది.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023

అంతే కాకుండా మొదటి నుంచి కూడా తేజస్వి మాటతీరు అన్ని కూడా బాగానే ఉన్నాయి.అలాంటి తేజస్వి ఎలిమినేట్ అయ్యింది అని వార్తలు బయటకు వార్తలు రావడం నిజంగా అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

Advertisement

తాజా వార్తలు