వర్మ దారిలో తేజ.. బిగ్‌బాస్ పాపతో రెచ్చిపోతున్నాడట!

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల వరుసబెట్టి బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలను తెరకెక్కిస్తూ తన ఏటీటీలో రిలీజ్ చేస్తూ వస్తున్నాడు.

ఇప్పటికే క్లైమాక్స్, నగ్నం వంటి సినిమాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో, వర్మ మరిన్ని సినిమాలను చేస్తూ రెచ్చిపోతున్నాడు.

అయితే ఇప్పుడు ఇతర దర్శకులు కూడా వర్మ బాటలో పయనించేందుకు రెడీ అవుతున్నారు.ఈ జాబితాలో తాజాగా దర్శకుడు తేజ కూడా చేరిపోయాడు.

ప్రస్తుతం మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా అలిమేలు మంగ వెంకటరమణ అనే సినిమాను తెరకెక్కించేందుకు తేజ రెడీ అవుతున్నాడు.కాగా ఈ క్రమంలో ఓ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేసేందుకు తేజ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

సినిమాల్లో అయితే సెన్సార్ కారణంగా తేజ ప్రతి అంశాన్ని చూపించలేకపోయాడు.ఇప్పుడు వెబ్ సిరీస్ కావడంతో ఆయనకు తోచింది తప్పకుండా చూపిస్తాడని తేజ ఫ్యాన్స్ అంటున్నారు.

Advertisement

ఈ వెబ్ సిరీస్ చాలా బోల్డ్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.బిగ్ బాస్ ఫేం నందిని రాయ్‌తో ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించేందుకు తేజ సిద్ధమయ్యాడు.

ఇప్పటికే కొంతమేర షూటింగ్ కూడా జరిపినట్లు తెలుస్తోంది.మొత్తానికి వర్మ లాంటి బోల్డ్ కంటెంట్ డైరెక్టర్ల జాబితాలో దర్శకుడు తేజ కూడా జాయిన్ కావడంతో ఆయన ఎలాంటి కథనాన్ని మనకు అందిస్తాడో చూడాలి అంటున్నారు.

మరి తేజ ఈ వెబ్ సిరీస్‌ను ఎలా తెరకెక్కిస్తాడో చూడాలి అంటున్నారు ఆయన ఫ్యా్న్స్.ఇక గోపీచంద్ సినిమాను కూడా వీలైనంత త్వరగా తెరకెక్కించేందుకు తేజ రెడీ అవుతున్నాడు.

సినిమా షూటింగ్‌లు పూర్తిస్థాయిలో మొదలు కాగానే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నాడు.

పాతిక లక్షల సహాయం అబద్దం.. కాంగ్రెస్ రెబల్ లీడర్ సంచలన వ్యాఖ్యలు వైరల్!
Advertisement

తాజా వార్తలు