టీడీపీ, వైసీపీవి స్వార్ధ రాజకీయాలు.. ఎంపీ జీవీఎల్

టీడీపీ, వైసీపీవి స్వార్ధ రాజకీయాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు.

సీఎం, ప్రతిపక్ష నేతలకు హైదరాబాద్ పై ఉన్న ప్రేమ రాష్ట్ర అభివృద్ధిపై లేదని విమర్శించారు.

ఏపీలో ఐదు లక్షల మంది ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోంలో ఉన్నారని చెప్పారు.ఈ క్రమంలో వారంతా విశాఖలోనే పని చేసేలా ఐటీ కంపెనీలతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.

ఐటీపై అవగాహన పెంచుకోవడానికి మంత్రి అమర్నాథ్ ఓరియంటేషన్ తీసుకోవాలని తెలిపారు.మంత్రిగా అవగాహన లేకుంటే రాష్ట్రంలోకి పెట్టుబడిదారులను ఎలా ఆహ్వానిస్తారని జీవీఎల్ ప్రశ్నించారు.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు