లోకేష్ అంత అలుసైపోయాడా ? అందరి టార్గెట్ ఆయనేనా ?

ఇప్పటి వరకు చంద్రబాబు తనయుడిగా, కాబోయే టిడిపి రథసారధిగా తెలుగుదేశం పార్టీ నేతల నుంచి కీర్తి ప్రశంసలు అందుకున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అలియాస్ చినబాబు మీద ఇప్పుడు రాజకీయ చర్చ తీవ్రతరం అవుతోంది.

తెలుగుదేశం పార్టీని వీడి బయటకు వెళ్లిపోతున్న నాయకుల ప్రధాన టార్గెట్ అంతా లోకేష్ గానే కనిపిస్తోంది.

ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు కంటే లోకేష్ ఒక్కరినే ఎక్కువగా కార్నర్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు.వీరు వ్యాఖ్యలను బట్టి చూస్తే లోకేష్ మీద వారికి ఎంత పగ, కసి ఉందో అర్థమవుతోంది.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా లోకేష్ కేంద్రంగా రాజకీయం నడిచేది.ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు ఆ పార్టీ నాయకులు పోటా పోటీ పడేవారు.

ఆయనను ప్రసన్నం చేసుకుంటే చాలు తమ పని అయినట్టే అన్నట్టుగా నాయకులు ఎదురుచూపులు చూసేవారు.ఈ క్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, నాలుగైదు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు తీవ్ర అవమానకర పరిస్థితులు ఎదుర్కొనే వారట.

Advertisement

ఎంత సీనియర్ నాయకులనైనా లోకేష్ చిన్న చూపు చూస్తూ, ఏకవచనంతో సంబోధిస్తూ అవమానపరిచే వారట.అయితే అప్పట్లో పార్టీ అధికారంలో ఉండడం, లోకేష్ హవా నడుస్తూ ఉండడంతో ఎవరూ నోరు మెదిపే సాహసం చేయలేదట.అప్పటి నుంచి లోకేష్ పై నాయకులంతా గుర్రుగానే ఉన్నారట.

ప్రస్తుతం టీడీపీ ప్రతిపక్షంలో ఉండడంతో వీరి విమర్శలకు పదును ఎక్కవ పెడుతున్నారు.ఇక ఇదే సరైన సమయమని బిజెపి, వైసిపి పార్టీలు టీడీపీని టార్గెట్ చేసుకుని రాజకీయం చేస్తుండడం చంద్రబాబుకు మింగుడు పడడం లేదు.

ఇదే సమయంలో పార్టీని వీడి వెళుతున్న వారంతా లోకేష్ పై అవమానకరమైన ,వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు.తాజాగా పార్టీని వీడిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లోకేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ తప్పుపడుతున్నారు.

ఆయన పేరు లోకేష్ అంటే ఎవరికి తెలుస్తుందయ్యా పప్పు అనండి అంటూ వెటకారం చేస్తున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ హెచ్చరిక..!!
10 గంటల పాటు డంప్ యార్డ్ లో ధనుష్.. ఈ నటుడి కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!

వర్ధంతికి, జయంతికి తేడా తెలియని వారి చేతిలో పార్టీని పెడితే ఇలాగే ఉంటుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.అసలు లోకేష్ బరువు మోయలేకే టిడిపి నావా ములిగిపోతోందని వంశీ విమర్శలు చేస్తున్నారు.లోకేష్ పై వంశీ చేసిన వ్యాఖ్యలు సాధారణమైన అనుకున్నా టీడీపీలో ఉన్న నాయకులు కూడా ఇదే అభిప్రాయాన్ని లోలోపల వ్యక్తం చేస్తున్నారట.

Advertisement

ప్రస్తుతం టీడీపీలో ఈ విషయంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోందంట.అందరూ లోకేష్ నే టార్గెట్ చేసుకుంటే ఆయన రాజకీయ భవిష్యత్తు చాలా ఇబ్బందుల్లో పడుతుందని బాబు పార్టీ సీనియర్ల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.

తాజా వార్తలు