లడ్డు ఫ్యాకింగ్ లో టిటిడి సరికొత్త నిర్ణయం !

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు.లడ్డు కోసం గంటల తరబడి క్యూలో కూడా నిలబడేందుకు కూడా వెనకాడరు.

దీంతో శ్రీవారి లడ్డూ సరికొత్త రీతిలో భక్తులకు అందించాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఆలోచిస్తుంది.ప్రస్తుతం పాలిథిన్ కవర్ లో శ్రీవారి లడ్డును ప్యాక్ చేస్తున్నారు.

అయితే ప్లాస్టిక్ వినియోగం వల్ల వస్తున్న అనర్థాల పై ప్రస్తుతం ప్రభుత్వం అవగాహన కల్పిస్తూ ప్లాస్టిక్ నిషేధం దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఇకపై శ్రీవారి లడ్డూల ప్యాకింగ్ కోసం కాగితం, జనపనార సంచులు అందుబాటులోకి తీసుకువచ్చింది టిటిడి.అంతేకాకుండా తిరుమల కొండపై కాగితం కప్పులు వినియోగంలోకి తీసుకువస్తోంది.

అదేవిధంగా తిరుమలలోని అన్ని అతిథిగృహాల్లోనూ తాగునీటి శుద్ధి యంత్రాలను అమిర్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.అలాగే దశలవారీగా తిరుమలలో ప్లాస్టిక్ నిషేధాన్ని సంక్రాంతిలోగా పూర్తిస్థాయిలో అమలు చేయాలని చూస్తోంది.

Advertisement

ఇటీవలే శ్రీవారి లడ్డూ ప్రసాదాలు ధరలు పెంచేందుకు టీటీడీ చూసింది.అయితే దీనిపై భక్తుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే.

వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..
Advertisement

తాజా వార్తలు