ఏపీలో రేపు టీడీపీ వినూత్న నిరసన కార్యక్రమం

ఏపీలో రేపు టీడీపీ వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించనుంది.

ఈ మేరకు గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపిద్దాం అంటూ నిరసన తెలపనున్నట్లు ఆ పార్టీ నేతలు వెల్లడించారు.

ఇందులో భాగంగా రేపు రాత్రి 7 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లలో లైట్లు ఆర్పి సెల్ ఫోన్ టార్చ్ లేదా కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలపాలని టీడీపీ నిర్ణయించింది.ఈ క్రమంలో దాదాపు ఐదు నిమిషాల పాటు నిరసన తెలపాలని టీడీపీ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

ఆ సమయంలో రోడ్డుపై వాహనాల్లో ఉంటే వాహన లైట్లు బ్లింక్ కొట్టాలని సూచించారు.శాంతియుత నిరసన కార్యక్రమం ఏపీ వ్యాప్తంగా నిర్వహించాలని టీడీపీ భావిస్తోంది.

కాగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో భాగంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

Advertisement
పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..!!

తాజా వార్తలు