పుష్ప 2 సెట్ లో సందడి చేసిన తారక్... అదే కారణమా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) ప్రస్తుతం పుష్ప 2 ( Pushpa 2 ) సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.

సుకుమార్ ( Sukumar )దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో శర వేగంగా జరుగుతున్నాయి.అయితే ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ పై అలాగే డైరెక్టర్ సుకుమార్ ఇంటిపై ఐటి అధికారులు దాడులు చేసిన నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ కాస్త బ్రేక్ పడిందని చెప్పాలి.

ఇక ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ వేశారు.ఈ క్రమంలోనే పుష్ప2 సినిమా షూటింగ్ లొకేషన్లోకి యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) ఎంట్రీ ఇస్తూ అందరికీ సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే ఎన్టీఆర్ పుష్ప 2 లొకేషన్ లోకి రావడానికి మరే కారణం లేదని తెలుస్తోంది.ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో సినిమా షూటింగ్ జరుగుతున్న విషయం మనకు తెలిసిందే.

Advertisement

ఈ సినిమా షూటింగ్ కూడా రామోజీ ఫిలిం సిటీ లోనే జరుగుతుంది.

ఇలా ఈ రెండు సినిమా షూటింగులు రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ తన సినిమా షూటింగ్ విరామ సమయంలో సరదాగా పుష్ప 2 సినిమా సెట్ లోకి అడుగు పెట్టారని తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం పుష్ప 2 సినిమా లోకేషన్లో ఎవరూ లేకపోవడం గమనార్హం.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఎన్టీఆర్ అల్లు అర్జున్ మధ్య ఎలాంటి బాండింగ్ ఉందో తాజాగా అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా బయటపడింది ఇద్దరు కూడా ఒకరినొకరు బావ అని సంబోధించుకోవడంతోనే వీరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో అర్థమవుతుంది.

మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు .. కీలక ఆధారాలు లభ్యం ? 
Advertisement

తాజా వార్తలు