రన్నింగ్ లో వున్న కారుపైకి ఎక్కి టపాసుల కాల్పులు... ఏం జరిగిందంటే?

సోషల్ మీడియా ప్రభావం ఎలా వుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.నిత్యం కొన్ని లక్షల వీడియోలు ఇక్కడ అప్లోడ్ అవుతూ ఉంటాయి.

అనేక వీడియోలు నెటిజన్లకు మంచి ఫన్ ఇస్తాయి.అందుకే పలు రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం మనం చూడవచ్చు.

ఈ క్రమంలో తాజాగా ఓ వీడియో నెటిజన్లను తీవ్రంగా ఆకట్టుకుంటోంది.సదరు వీడియో చూస్తే కొంతమంది వ్యక్తుల కదులుతున్న కారుపైకి ఎక్కి కూర్చొని బహిరంగంగా టపాసులు కలుస్తున్న దృశ్యాలు చాలా క్లియర్ గా కనిపిస్తాయి.

అహ్మదాబాద్‌లో దీపావళి పండగను పురస్కరించుకొని రద్దీగా ఉండే నడిరోడ్డుపై కొంతమంది పోకిరిగాళ్లు కారుపైకి ఎక్కి మరీ టపాసులు కలుస్తుండటం ఇక్కడ చూడవచ్చు.పైగా ఈ ప్రమాదకరమైన స్టంట్‌ ని వారు వీడియోలు కూడా తీస్తున్నారు పెద్ద ఘనకార్యం చేసినవారిలాగా.

Advertisement
Tapas Got On Top Of The Running Car And Fired What Happened , Running Car , Vira

దీపావళి తరువాత రోజు రాత్రే ఈ ఘటన జరిగింది.అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ కావడంతో అహ‍్మదాబాద్‌ పోలీసులు ఈ విషయమై చాలా సీరియస్‌ అవ్వడమే గాక సదరు వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.

Tapas Got On Top Of The Running Car And Fired What Happened , Running Car , Vira

అక్కడితో ఆగకుండా వారిని పనిష్ కూడా చేయడం విశేషం.ఇలాంటి ప్రమాదకరమైన చర్యలతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసినందుకు వారికి తగిన బుద్ధి చెప్పారు.అలాగే ట్రాఫిక్‌ భద్రత నియమాలను ఉల్లంఘించినిందుకు గాను వారిని బహిరంగంగానే శిక్షించారు.

ఈ మేరకు సదరు వ్యక్తుల చేత రోడ్డుపై గుంజీలు తీయిస్తూ నడిపించారు.మటికొంతమందిని వీపుపై కొడుతూ అదే నడిరోడ్డుపైనే కొడుతూ శిక్షించారు.

కాగా అందుకు సంబంధించన వీడియోతోపాటు సదరు వ్యక్తుల ఫోటోలను కూడా ట్విట్టర్‌లో పోలీస్ డిపార్ట్మెంట్ షేర్‌ చేశారు.దీంతో నెటిజన్లు అహ్మదాబాద్‌ పోలీసుల చర్యను ప్రశంసిస్తూ ట్వీట్‌ చేస్తున్నారు.

ఓరి దేవుడో.. జంతువులు మనుషుల్లా నడిస్తే ఎలా ఉంటుందో తెలుసా.. (వీడియో)
Advertisement

తాజా వార్తలు