కార్తికేయ కి జోడిగా కన్నడ స్టార్ హీరో మనవరాలు

యంగ్ హీరో కార్తికేయ ప్రస్తుతం టాలీవుడ్ లో బిజియస్ట్ యాక్టర్ గా మారిపోయాడు.

ఓ వైపు హీరోగా నటిస్తూ మరో వైపు విలన్ గా తనని తాను ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

తమిళ్లో అజిత్ హీరోగా తెరకెక్కుతున్న వాలిమై సినిమాలో కార్తికేయ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే శ్రీసరిపల్లి దర్శకత్వంలో కార్తికేయ ఎన్.ఐ.ఏ ఆఫీసర్ గా ఒక మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే.ఈ మూవీ షూటింగ్ కూడా కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ కంటే ముందుగానే స్టార్ట్ అయ్యింది.

ఇదిలా ఉంటే ఈ రోజు కార్తికేయ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ ని ఆవిష్కరించున్నారు.ఇదిలా ఉంటే ఈ చిత్రంలో మరో విశేషం కూడా ఉంది.

కన్నడ నాట 80, 90 దశకంలో స్టార్ హీరోగా, ఫ్యామిలీ చిత్రాల కథానాయకుడుగా గుర్తింపు తెచ్చుకున్న రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెడుతుంది.రవిచంద్రన్, చిరంజీవి కలిసి కన్నడ, తెలుగు బైలింగ్వల్ మూవీ కూడా చేశారు.

Advertisement
Tanya Ravichandran Romance With Karthikeya, Tollywood Sri Saripalli, Kannada Sta

ఇక తాత వారసత్వంతో వెండితెరపై హీరోయిన్ గా తాన్యా ఇప్పటికే అరంగేట్రం చేసింది.కన్నడ, తమిళ్ ఇండస్ట్రీలో సినిమాలు చేసింది.

ఇప్పుడు కార్తికేయ కొత్త సినిమా ద్వారా టాలీవుడ్ లో అడుగుపెడుతుంది.ఇప్పటికే యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

Tanya Ravichandran Romance With Karthikeya, Tollywood Sri Saripalli, Kannada Sta

అయితే అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేదు.అలాగే మలయాళీ దర్శకుడు ప్రియదర్షన్ కూతురు కళ్యాణి కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.ఈమె కూడా పెద్దగా సక్సెస్ కాలేదు.

మరి కన్నడ స్టార్ హీరో మనవరాలు తాన్యా ఎంత వరకు సక్సెస్ అవుతుంది అనేది చూడాలి.

కూలీ కోసం బుట్ట బొమ్మ... కళ్ళు చెదిరే రేంజిలో రెమ్యూనరేషన్?
Advertisement

తాజా వార్తలు