తెలుగు ఎన్నారైల పిల్లల కోసం...తానా “తెలుగు తేజం” పోటీలు...!!!

అగ్ర రాజ్యం అమెరికాలో మన తెలుగు రాష్ట్రాల నుంచీ వెళ్ళిన తెలుగు వారు లెక్కకు మించి ఉంటారు.

తెలుగు వారి సంక్షేమం, అభివృద్ధి కోసం అక్కడ తెలుగు ప్రవాస సంఘాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉంటాయి.

ప్రాంతాల వారిగా అక్కడ తెలుగు సంఘాలు కూడా ఎన్నో ఉన్నాయి.ఎన్ని సంఘాలు ఉన్నా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కు మాత్రం ఎప్పుడూ ప్రత్యేక స్థానాన్ని కలిగిఉంటుంది.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సంఘాలలో తానానే అతిపెద్ద తెలుగు సంఘంగా చెప్పవచ్చు.తెలుగు బాషాభివృద్దికోసం, తానా చేపట్టిన కార్యక్రమం లేదంటే అతిశయోక్తి కాదు.

తెలుగు కుటుంబాల పిల్లలకు తెలుగు నేర్పేందుకు పలు స్వచ్చందం సంస్థలతో కలిసి తానా పాటశాల ను కూడా ఏర్పాటు చేసింది.వారికి తెలుగు పట్ల అభిమానం కలగడానికి వారిని తెలుగు బాషలో ప్రావీణ్యులుగా తీర్చి దిద్దేందుకు ఎన్నో కార్యక్రమాలని నిర్వహించింది కూడా.

Advertisement

తాజాగా తెలుగు ఎన్నారైల పిల్లల కోసం ప్రత్యేకంగా తెలుగు తేజం బాషా పటిమ పోటీలు నిర్వహించింది.తానా – తెలుగు పరివ్యాప్తి కమిటి ఆధ్వర్యంలో తెలుగు తేజం పోటీలను ఏర్పాటు చేయనుంది.

ప్రవాసుల పిల్లలకు తెలుగు బాషపై ప్రేమను మక్కువను పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా తానా సభ్యులు తెలిపారు.ఈ పోటీలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రవాస పిల్లలు పాల్గొనవచ్చునని కానీ తెలుగు రాష్ట్రాలలో ఉన్న పిల్లలకు ఈ పోటీలలో పాల్గొనే అవకాశం లేదని తెలిపారు.

ప్రతీ ఒక్క ప్రవాస తల్లి తండ్రులు తమ పిల్లలు ఈ పోటీలలో పాల్గొనేలా ప్రోశ్చహించాలని కోరారు.మరిన్ని వివరాలకోసం .

కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?
Advertisement

తాజా వార్తలు