200 తెలుగు ఎన్నారైలకి 'తానా'..శిక్షణ.

అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘంగా పేరొందిన తానా ఎదో ఒక కార్యక్రమంతో ఎన్నారైలని ఎప్పటికప్పుడు సంఘటితం చేస్తూ ఉంటుంది.

తెలుగు పండుగలని అందరితో కలిసి చేపడుతూ భారతీయ సంస్కృతులని అమెరికాలో పాటిస్తున్న సంఘాలలో ముందు వరుసలో నిలుస్తుంది తానా.

అయితే తాజాగా ఇప్పుడు తానా ఒక ప్రాణాన్ని నిలబెట్టే సీపీఆర్ పద్దతిపై దాదాపు 200 మంది ఎన్నారైలకి శిక్షణ ఇచ్చింది.

డా.గొట్టిముక్కల అనుపమ, డా.బీరం శ్రీధర్‌లు ఈ శిక్షణ కార్యక్రమాన్ని ముందుంది నడిపించారు.సీపీఆర్‌ వంటి సునాయాస పద్ధతి పట్ల అవగాహన పెంపొందించుకుంటే, ఆపత్కాలంలో ఉన్న మనిషి ప్రాణాలను కాపాడేందుకు అవకాశం ఉంటుందని వారు తెలిపారు.

తానా ఆధ్వర్యంలో, స్వఛంద కార్యకర్తల సహకారంతో నిర్వహించిన ఈ మంచి కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరిగిందని సభ్యులు అన్నారు.ఈ కార్యక్రమానికి తానా సభ్యులు వుయ్యూరు శ్రీలక్ష్మీ.అట్లూరి ఫణి.అట్లూరి అనూ.డా.చెరుకు కిరణ్‌, తానా అధ్యక్షుడు వేమన సతీష్‌, తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ డా.నల్లూరి ప్రసాద్‌.తదితరులు పాల్గొన్నారు.

Advertisement
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు