తమన్నా ఓవరాక్షన్ భరించలేకపోతున్న ఫ్యాన్స్.. ఆ మూడు సినిమాల ఫ్లాప్ రిజల్ట్ కు తమన్నా కారణమా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాల పాటు ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో ఒకరైన తమన్నా( Tamannaah ) భోళా శంకర్ సినిమాకు మాత్రం మైనస్ అయ్యారు.

తను నటించిన సినిమాలలో కొన్ని సినిమాలలో తమన్నా యాక్టింగ్ అద్భుతంగా ఉంటే మరికొన్ని సినిమాలలో మాత్రం ఓవరాక్షన్ చేసినట్టుగా ఉంటుంది.

భోళా శంకర్( Bhola Shankar ) మూవీలో తమన్నా కనిపించేది కొన్ని సీన్లే అయినా ఆ సీన్లు ప్రేక్షకులకు చిరాకు తెప్పించే విధంగా ఉన్నాయి.రెబల్, ఆగడు, భోళా శంకర్ సినిమాల ఫ్లాప్ రిజల్ట్ లో తమన్నాకు కూడా భాగం ఉందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తమన్నా సీన్ కు ఎంత అవసరమో అంత కాకుండా కొంతమంది ప్రేక్షకులకు చిరాకు వచ్చేలా నటిస్తున్నారు.మంచి పాత్రను సైతం ప్రేక్షకులకు చిరాకు తెప్పించే విధంగా తమన్నా మారుస్తున్నారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ కామెంట్ల గురించి తమన్నా ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. హ్యాపీడేస్, 100% లవ్, బాహుబలి ( Happy Days, 100% Love, Baahubali )సినిమాలలో అద్భుతమైన నటన కనబరిచిన తమన్నా మరికొన్ని పెద్ద సినిమాలలో తన పాత్రలకు న్యాయం చేయలేకపోయారు.భోళా శంకర్ సినిమాలో తమన్నా యాక్టింగ్ తో పోల్చి చూస్తే కీర్తి సురేష్ యాక్టింగ్ ఎన్నో రెట్లు బెటర్ గా ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

ఓవరాక్షన్ తో ప్రేక్షకులకు చిరాకు తెప్పించేలా తమన్నా నటించొద్దని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.తమన్నాకు ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్లు తగ్గగా భోళా శంకర్ రిజల్ట్ తో ఆమెకు కొత్త ఆఫర్లు కష్టమని కామెంట్లు వినిపిస్తున్నాయి.సుశాంత్ సైతం ఈ సినిమాలో పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలో నటించారు.

ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం తెలుగులో తీసిన కథలతో మెహర్ రమేష్ ప్రయోగం చేయడమే భోళా శంకర్ షాకింగ్ ఫలితానికి కారణమైంది.ఈ సినిమాలో చాలామందికి సరైన పాత్రలు దక్కలేదు.

Advertisement

తాజా వార్తలు