రేణు దేశాయ్ మాటలు పవన్ పాలిటిక్స్ కు పనికొచ్చేనా..?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఈసారి ఎలాగైనా గద్దెదించాలని ఓవైపు టిడిపి మరోవైపు జనసేన ( Janasena ) పార్టీ నాయకులు కంకణం కట్టుకొని ఉన్నారు.

 Will Renu Desai's Words Work For Pawan's Politics , Pawan's Politics, Renu Desa-TeluguStop.com

ఈ తరుణంలోనే టిడిపి మూడు సభలు ఆరు మాటలుగా ప్రజల్లో మమేకమైతూ తిరుగుతోంది.అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan kalyan ) కూడా ఈసారి ప్రజలను ఎలాగైనా ఆకట్టుకోవాలని ఆంధ్రప్రదేశ్ లో కనీసం కొన్ని సీట్లు అయినా సాధించాలని గట్టిగానే కష్టపడుతున్నాడు.

ఇక ఈ రెండు పార్టీలకు ధీటుగా అధికార వైసిపి పార్టీ ప్రజల కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతూ ముందుకు పోతోంది.

Telugu Ambati Rambabu, Ap, Bro, Janasena, Pawan Kalyan, Renu Desai-Politics

ప్రతిపక్షాల మాటలను తిప్పికొడుతూ దూసుకెళ్తోందని చెప్పవచ్చు.ఈ తరుణంలో రాబోయే ఎన్నికల్లో ఈ మూడు పార్టీల మధ్య పోటీ ఏర్పడే అవకాశం ఉంది.ఈ తరుణంలోనే పవన్ కళ్యాణ్ కాస్త దూకుడు పెంచారని చెప్పవచ్చు.

ప్రస్తుతం ఏపీలో రాజకీయాలన్నీ పవన్ వైసీపీ అన్నట్టుగా ఉన్నాయి.ఈ మధ్య కాలంలోనే బ్రో సినిమా ( Bro Movie ) కు సంబంధించి శ్యాంబాబు అనే పాత్రను మంత్రి అంబటి రాంబాబును అనుకరించి చేశారని ఆయన తరచూ పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేస్తూ వస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆయన నేను వైసీపీ నాయకులు అంతా కలిసి ఒక వెబ్ సిరీస్ తీయబోతున్నామని, ప్రముఖ సినీ హీరో తమ్ముడు ఒక పెళ్లి తర్వాత మరో పెళ్లి మరో పెళ్లి తర్వాత ఇంకో పెళ్లి అలా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని,ఇదే మా వెబ్ సిరీస్ లోని కథ అంటూ చెప్పుకొచ్చారు.అంతేకాకుండా రెండో భార్యను చేసుకున్న తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారని తర్వాత ఆమెను కూడా వదిలేసి మరో పెళ్లి చేసుకున్నాడని కామెంట్స్ చేశారు.

Telugu Ambati Rambabu, Ap, Bro, Janasena, Pawan Kalyan, Renu Desai-Politics

అయితే ఆంధ్రప్రదేశ్లో పవన్ గురించి ఇప్పటివరకు చాలామంది నేతలు మూడు పెళ్లిళ్లు అని ఎద్దేవా చేశారు.అంతేకాకుండా రేణు దేశాయ్ కి అన్యాయం చేశారంటూ కూడా మాట్లాడారు.తాజాగా అంబటి రాంబాబు ( Ambati rambabu ) ఈ విధంగా వెబ్ సిరీస్ తీస్తున్నామని అందులో రెండో భార్య పిల్లలు అనే ఒక మాట తీసుకురావడంతో రేణు దేశాయ్ కూడా స్పందించింది.పవన్ కళ్యాణ్ ది తప్పే అని చెబుతూ, ఆయనకు నేను 100% సపోర్ట్ ఉంటానని, తన రాజకీయానికి నేను అడ్డు కాదని, రాజకీయాల్లోకి పిల్లలను లాగ వద్దని, ఎవరి పర్సనల్ విషయాలు వారికి ఉంటాయని గట్టిగా వైసిపి నేతలకు కౌంటర్ ఇచ్చింది.

ఈ కౌంటర్ క్షుణ్ణంగా గమనిస్తే మాత్రం ఇకముందు రాజకీయ ప్రత్యర్థులు ఎవరు కూడా ఆయన మూడు పెళ్లిళ్ల గురించి ప్రస్తావించే అవకాశం కనిపించడం లేదు.ఈ విధంగా రేణు దేశాయ్ ( Renu desai ) పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా కలిసి వస్తుంది అని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube