తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రాజమౌళి( Rajamouli ) లా ఫ్యామిలీ మొత్తం సినిమాకు పనిచేసే వారు ఇంకెవరు ఉండరని చెప్పొచ్చు.ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒకే ఫ్యామిలీకి సంబందించిన డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, కాస్టూం డిజైనర్, ప్రొడక్షన్ మేనేజర్ ఇలా అన్ని విభాగాల్లో రాజమౌళి ఫ్యామిలీ తమ పనితనం చూపిస్తుంది.
కేవలం రాజమౌళి వల్లే వారు అలా తమకు నచ్చిన విభాగాలు సెట్ చేసుకున్నారని తెలుస్తుంది.ఇదిలాఉంటే రాజమౌళి ఫ్యామిలీ నుంచి లేటెస్ట్ గా కీరవాణి తనయుడు శ్రీ సింహా ( Sri Simha )హీరోగా చేస్తున్నాడు.
మత్తువదలరా సినిమాతో హీరోగా పరిచయమైన అతను మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నా ఆ తర్వాత వరుస సినిమాలు నిరాశ పరచాయి.ఇక లేటెస్ట్ గా ఉస్తాద్ ( Ustad )అంటూ మరో ప్రయత్నంతో వస్తున్నాడు.
ఉస్తాద్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది.ఈ సినిమా విషయంలో మేకర్స్ మంచి అంచనాలతో ఉన్నారు.
ఉస్తాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడిన విధానం చూస్తుంటే శ్రీ సింహాని కచ్చితంగా స్టార్ హీరోని చేసే ఆలోచనలో ఉన్నారని అర్ధమైంది.సో శ్రీ సిం హా తో జక్కన్న ఫ్యామిలీ పెద్ద ప్లానింగ్ తోనే ఉందని చెప్పొచ్చు.