వర్షాకాలంలో ఆరోగ్యం జాగ్రత్త..! ఆ సమయంలో లో రోగనిరోధక శక్తి తప్పనిసరి..!

ఇప్పుడిప్పుడే వర్షాకాలం( rainy season ) సంకేతంగా తొలకరి జల్లులు చల్లని అనుభూతిని కలిగిస్తున్నాయి.ఇక చిటపట చినుకులు కురుస్తూ ఉన్నాయి.

ఈ విధంగా వర్షాకాలం వస్తుందని అర్థం.వర్షాకాలం ఆనందాలతో పాటు కొన్ని సీజనల్ వ్యాధులను కూడా తీసుకొస్తుంది.

ఈ సమయంలో ఎవరైనా చాలా త్వరగా అనారోగ్యానికి గురవుతారు.అయితే దోమల( Mosquitoes ) ద్వారా సంక్రమించే ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ వైరల్ వ్యాధులు, ఆహారం ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్లు ఈ సీజన్లో ఉంటాయి.

అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి.అందుకే ఇలాంటి సమయంలో బయట చేసే ఆహారాలను, స్ట్రీట్ ఫుడ్ లను నివారించడం మంచిది.

Advertisement

ఇక అతిసారా, కలరా వ్యాధులను( Diarrhea , cholera ) నివారించడానికి ఆ సమయంలో కాచిన నీటిని తీసుకోవడం, సరిగ్గా ఉడికించిన లేదా మూతపెట్టనీ ఆహారాన్ని నివారించడం చాలా అవసరం.అంతే కాకుండా తరచూ చేతి పరిశుభ్రతను పాటించాలి.ఈ సీజన్లో ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రమైన సమతుల్య ఆహారం తీసుకోవాలి.

అంతేకాకుండా తగినంత నిద్ర, వ్యాయామం చేయడం చాలా అవసరం.అయితే మరీ ముఖ్యంగా వర్షాకాలంలో రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు ప్రయత్నించాలి.

అయితే వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆపిల్, జామున్, లిచీ, చెర్రీస్, బేరి, దానిమ్మ లాంటి పండ్లను తీసుకోవడం మంచిది.వర్షాకాలంలో పుచ్చకాయ, సీతాఫలాన్ని నివారించడం మంచిది.అంతే కాకుండా ఆహారంలో వెల్లుల్లిని కూడా చేర్చుకోవాలి.

జాతీయ అవార్డును పునీత్ రాజ్ కుమార్ కు అంకితం చేసిన రిషబ్ శెట్టి.. ఏం జరిగిందంటే?
వీళ్లకు వేరే సినిమాల వల్లే హిట్ సినిమాల్లో ఛాన్సెస్ వచ్చాయి..?

ఇక పాలకు బదులు పెరుగు ఇతర ప్రోబయోటిక్స్ తీసుకోవాలి.ఇవి చెడు బ్యాక్టీరియాను ప్రవేశించే అవకాశాన్ని తగ్గిస్తాయి.

Advertisement

ఇక అంటువ్యాధులను నివారించడానికి మెంతులు, కాకరకాయ, వేపా, పసుపు లాంటి మూలికలు, సుగంధ ద్రవ్యాలు సహాయపడతాయి.వర్షాకాలంలో పచ్చివి తినడం, సలాడ్ లు తినడం మానుకోవాలి.

ఇక వర్షాకాలంలో మాంసానికి దూరం ఉంటే చాలా మంచిది.దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వారు లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు లాంటి ఔషధ గుణాలు కలిగిన మసాల దినుసులతో తయారుచేసిన డికాషన్ తాగడం మంచిది.

తాజా వార్తలు