ప్రభాస్ మంచితనంపై హీరో సూర్య కామెంట్స్.. సోషల్ మీడియాలో వైరల్!

టాలీవుడ్ యంగ్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

సినీ ఇండస్ట్రీలో ప్రభాస్ తో కలిసి పనిచేసిన ఎంతో మంది అతని గురించి అతను గొప్ప మనసు గురించి, ప్రభాస్ మంచి తనం గురించి ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

ప్రభాస్ ఎవరికి ఎటువంటి సహాయం కావాలి అన్న వెంటనే రెస్పాండ్ అవుతూ ఉంటాడని, అలాగే షూటింగ్ సెట్ లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని సమానంగా గౌరవిస్తాడు అని చెబుతూ ఉంటాడు.ఇప్పటికీ ఎంతోమంది ప్రభాస్ గురించి గొప్పగా పొగుడుతూ చెప్పగా తాజాగా తమిళ హీరో అయినా సూర్య ప్రభాస్ మంచి తనం గురించి చెప్పాడు.

ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.గ్యాంగ్ సినిమాని తెలుగులో రిలీజ్ చేయడానికి ఇబ్బందులు ఎదురైన సమయంలో పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా రిలీజ్ అవుతోంది.

మా సినిమా కోసం తెలుగులో చాలా మంది డిస్ట్రిబ్యూటర్ లను కూడా సంప్రదించాము.పవర్ స్టార్ సినిమా విడుదల అవుతోంది అంటే హంగామా ఏ రేంజ్ లో ఉంటుందో మనందరికీ తెలిసిందే.

Advertisement
Surya Praises Prabhas Helping Nature, Surya , Prabhas, Helping Nature, Pan Indi

పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అవుతుండటంతో సూర్య సినిమాను కుదరదు అని చెప్పేశారట.అప్పుడు ప్రభాస్ ని కలిసి వెళ్లి ప్రాబ్లం వివరించగా, ఇక మరుసటి రోజే నేను అడిగిన దానికంటే ఎక్కువ థియేటర్స్ ఇప్పించాడు.

Surya Praises Prabhas Helping Nature, Surya , Prabhas, Helping Nature, Pan Indi

అసలు ప్రభాస్ ఏం చేశాడు ఏమో తెలియదు అని తెలిపాడు సూర్య.సరిపోతాయా ఇంకా కావాలా డార్లింగ్ అని అడిగాడు.సినిమా రిలీజ్ అవుతుందా అనుకుంటున్న సమయంలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యేలా హెల్ప్ చేశాడు ప్రభాస్ అంటూ అతని మంచితనం గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పుకొచ్చాడు సూర్య.

సూర్య చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటలు విని ఎంతో సంతోషించాను.. నాగచైతన్య కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు