భర్తతో కలిసి జిమ్ లో తెగ కష్టపడుతున్న జ్యోతిక.. వర్కౌట్స్ మామూలుగా లేవుగా?

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కపుల్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో సూర్య( Suriya ) జ్యోతిక ( Jyothika ) జంట ఒకటి అని చెప్పాలి.

వీరిద్దరూ ఇండస్ట్రీలో కొనసాగుతూ పలు సినిమాలలో నటించారు.

ఇలా సినిమాలలో నటిస్తున్న సమయంలోనే ప్రేమలో పడినటువంటి ఈ జంట పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకొని ఎందరికో ఆదర్శంగా నిలిచారు.సాధారణంగా ఓకే ప్రొఫెషన్ లో కొనసాగే వారు పెద్దగా అన్యోన్యంగా ఉండాలని అలాంటివారు కలిసి ఉండేదే ఎక్కువ అని చాలా మంది భావిస్తున్నారు.

ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి భార్యాభర్తలు సంతోషంగా ఉన్నటువంటి సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి అయితే వీరిద్దరూ మాత్రం సినిమా ఇండస్ట్రీలోనే ఉంటూ ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఎంతో అన్యోన్యంగా ఉన్నారని చెప్పాలి.

ఇక సూర్య సినిమాల పరంగా జ్యోతిక ఎంతో సపోర్ట్ చేస్తూ ఉంటారు.ఆయన ప్రతి ఒక్క కదలికలోను జ్యోతిక తన వెన్నంటే ఉంటూ తన భర్తను ప్రోత్సహిస్తూ ఉంటారు.ప్రస్తుతం సూర్య కంగువ ( Kanguva ) అనే భారీ ప్రాజెక్టులో భాగమైన సంగతి మనకు తెలిసిందే.

Advertisement

ఈ సినిమాలో ఈయన ఒక వైల్డ్ బీస్ట్ లాగా కనిపించబోతున్నారు. ఈ సినిమా వివిధ భాషలలో భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందు రాబోతోంది.ఇలాంటి సినిమాలలో నటించడం కోసం సూర్య భారీ కండలతో కనిపించాల్సి వస్తుంది.

ఈ క్రమంలోనే సూర్య పెద్ద ఎత్తున జిమ్ లో వర్కౌట్లు ( Work Outs ) చేస్తూ తన ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టారు.అయితే తన భర్తతో పాటు జ్యోతిక సైతం జిమ్ లో వర్కౌట్ చేస్తూ తన భర్తను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు.సూర్య చేసే వర్కౌట్స్ అన్నింటిని కూడా జ్యోతిక చేస్తూ ఆయనలో మరింత ఉత్సాహాన్ని నింపుతూ ఉన్నారు.

ఇలా వీరిద్దరూ వర్కౌట్స్ చేస్తున్నటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియో చూస్తే కనుక అసలు జ్యోతిక ఏంటి సూర్యతో సమానంగా ఇలా వర్కౌట్స్ చేస్తుందని భావించక మానరు.

ఈమె సూర్యతో పాటు సమానంగా భారీ వర్కౌట్ చేస్తూ అందరి చేత ఔరా అనిపించారు.మరికొందరు పర్ఫెక్ట్ కపుల్ గోల్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటిని షేక్ చేస్తుంది.

రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు