సినిమా ఆఫర్లు రావడం లేదంటూ సురేఖావాణి ఎమోషనల్.. ఏమైందంటే?

ప్రముఖ టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్టులలో ఒకరైన సురేఖావాణి గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

కొన్నేళ్ల క్రితం వరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న సురేఖావాణి ప్రస్తుతం తక్కువ సంఖ్యలోనే సినిమాలలో నటిస్తున్నారు.

సోషల్ మీడియాలో సురేఖావాణి యాక్టివ్ గానే ఉన్నప్పటికీ సినిమాలలో ఎందుకు ఎక్కువగా కనిపించడం లేదని ఆమె అభిమానులు భావిస్తున్నారు.అయితే తాజాగా సురేఖావాణి తన సినిమా ఆఫర్ల గురించి స్పందిస్తూ షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

సురేఖావాణి కీలక పాత్రలో నటించిన స్వాతిముత్యం మూవీ తాజాగా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన సురేఖావాణి సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ చాలామంది సినిమాలలో ఎందుకు కనిపించడం లేదని అడుగుతున్నారని చెప్పుకొచ్చారు.

అసలు నా వరకు సినిమా ఆఫర్లు వస్తే కదా చేయడానికి అంటూ సురేఖావాణి కామెంట్లు చేస్తూ ఎమోషనల్ అయ్యారు.

Surekhavani Comments About Movie Offers Details, Surekha Vani, Surekha Vani Movi
Advertisement
Surekhavani Comments About Movie Offers Details, Surekha Vani, Surekha Vani Movi

నాకు సినిమా ఆఫర్లు ఎందుకు రావడం లేదో అర్థం కావడం లేదని సురేఖావాణి అన్నారు.నేను సినిమాలు మానేశానని అనుకుంటున్నారని అయితే అది నిజం కాదని ఆమె చెప్పుకొచ్చారు.మంచి ఛాన్స్ లు వస్తే నేను కచ్చితంగా నటిస్తానని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం.

Surekhavani Comments About Movie Offers Details, Surekha Vani, Surekha Vani Movi

స్వాతిముత్యం సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చిన చిత్రబృందానికి కృతజ్ఞతలు అని సురేఖావాణి అన్నారు.సురేఖావాణి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సురేఖావాణి తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను సొంతం చేసుకోవాలని ఆమెకు మరిన్ని ఆఫర్లు రావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ప్రముఖ నటి సురేఖావాణి తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.సురేఖావాణి కెరీర్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.

మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!
Advertisement

తాజా వార్తలు