మహేష్ బాబు చిన్నతనం లో హీరోగా చేసిన ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్( Superstars ) ఎవరు అనే లిస్ట్ తీస్తే అందులో టాప్ 5 లో మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కచ్చితంగా ఉంటాడు.

సూపర్ స్టార్ కృష్ణ( Superstar Krishna ) తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆయన, చిన్నతనం లోనే ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి స్టార్ కిడ్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు.

అలా బాల్యం లోనే ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన మహేష్ బాబు, ఆ తర్వాత కొన్నాళ్ళకు రాజకుమారుడు అనే చిత్రం ద్వారా హీరో గా మన తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యాడు.ఈ సినిమా అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్.

ఆరోజుల్లోనే ఒక స్టార్ హీరోకి ఎంత వసూళ్లు అయితే వచ్చేవో, ఈ సినిమాకి కూడా అదే స్థాయి వసూళ్లు వచ్చాయి.అయితే ఈ సినిమాకి ముందే మహేష్ బాబు చిన్నతనం లో హీరో గా ఒక సినిమా చేసాడు.

ఆ చిత్రం పేరు బాలచంద్రుడు, ఈ సినిమాకి సూపర్ స్టార్ కృష్ణ స్వయంగా దర్శకత్వం వహించాడు.ఆరోజుల్లో ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైంది.అప్పటికే మహేష్ బాబు బాలనటుడిగా ఎన్నో చిత్రాల్లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు.

Advertisement

అలా వచ్చిన క్రేజ్ ఈ సినిమాకి జనాలు ఎగబడ్డారు, ఓపెనింగ్ఫ్స్ అదిరిపోయాయి సినిమా బాగుండడం తో కలెక్షన్స్ కూడా అదిరిపోయాయి.ఆరోజుల్లోనే ఈ చిత్రం దాదాపుగా నాలుగు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది అట.ఇందులో మహేష్ బాబు వేసే డ్యాన్స్, చేసే ఫైట్స్ చూస్తే చిన్నతనం లో ఈ రేంజ్ లో ఎలా చేసాడు అని ఆశ్చర్యపోక తప్పదు.ఈ చిత్రం ఇప్పటికీ యూట్యూబ్ లో అందుబాటులోనే ఉంది, వెళ్లి ఒక్కసారి చూడండి.

అక్కకోసం ఏమైనా చేసే తమ్ముడిగా మహేష్ బాబు ఇందులో ఎంతో అద్భుతంగా నటించాడు.

ఇక ఈ సినిమా లో తమిళ స్టార్ హీరో శరత్ కుమార్ విలన్ గా నటించాడు.ఆ రోజుల్లో ఆయా ఇంకా హీరో కాకముందు చేసిన సినిమా ఇది.కైకాల సత్యనారాయణ, రామిరెడ్డి , ఆహుతి ప్రసాద్ , బాబు మోహన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.అలా రాజకుమారుడు సినిమాకి ముందే మహేష్ బాబు బాలనటుడిగా సినిమా చేసి సూపర్ హిట్ ని అందుకున్నాడు.

కాబట్టి హీరో గా ఆయన మొదటి సూపర్ హిట్ చిత్రం ఇదే అని చెప్పొచ్చు.అలా తండ్రి అడుగుజాడల్లో నడిచి నేడు తండ్రినే మించిన తనయుడిగా ఎదిగి , త్వరలోనే రాజమౌళి సినిమాతో ప్రపంచ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని దున్నేయబోతున్నాడు మహేష్ బాబు.

గుండెను తడిమిన పునీత్ పెయింటింగ్.. గీసింది ఎవరంటే...
Advertisement

తాజా వార్తలు