Super star krishna last video: కన్నీళ్లు తెప్పిస్తున్న కృష్ణ చివరి వీడియో .. చాలా గొప్ప హీరో అంటూ?

సూపర్ స్టార్ కృష్ణ మనల్ని వీడి వెళ్లిపోయారనే వార్తను నమ్మలేకపోతున్నామని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

కృష్ణంరాజు మరణవార్తను మరవక ముందే కృష్ణ మృతి చెందడం ఫ్యాన్స్ ను మరింత బాధకు గురి చేస్తోంది.

కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.చివరి వీడియోలో అలీ నటించిన అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సినిమాను ప్రశంసిస్తూ చివరిగా కృష్ణ మీడియాతో మాట్లాడారు.

సినిమా చాలా బాగుందని నరేష్ యాక్టింగ్ తనకు నచ్చిందని కృష్ణ పేర్కొన్నారు.థియేటర్లలో ఈ సినిమా రిలీజై ఉంటే పెద్ద హిట్ అయ్యేదని ఆయన తెలిపారు.

కృష్ణ ఈ మాటలు మాట్లాడిన కొన్ని రోజుల్లోనే ఆయన మరణించడం ఫ్యాన్స్ ను బాధ పెడుతోంది.ఎంతోమంది నటీనటులు సక్సెస్ కావడంలో కృష్ణ కీలక పాత్ర పోషించారు.కృష్ణ చాలా గొప్ప హీరో అని చాలామంది నటీనటులు చెబుతున్నారు.15 రోజుల క్రితం వరకు ఆరోగ్యంగా ఉన్న కృష్ణ దూరమయ్యారనే వార్తను నమ్మలేకపోతున్నామని చాలామంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మహేష్ కంటతడి పెడుతున్న వీడియోలను చూసి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.

Advertisement
Super Star Krishna Last Video Goes Viral In Social Media Details Here , Supers

మహేష్ బాబుకు ఇలాంటి కష్టాలా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.మహేష్ బాబు కష్టాలను తలచుకుంటే బాధేస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Super Star Krishna Last Video Goes Viral In Social Media Details Here , Supers

ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు జరగనుండగా తెలంగాణ సర్కార్ ఈ విషయాన్ని ప్రకటించింది.మంచితనానికి కృష్ణ మారు పేరు అని దేవుడు చేసిన మనిషిని దేవుడే పిలిపించుకున్నాడని రాఘవేంద్రరావు పేర్కొన్నారు.తెలుగు సినిమాలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ధైర్యశాలి కృష్ణ ఇకలేరనే వార్తను నమ్మలేకపోతున్నామని ప్రముఖ సినీ సెలబ్రిటీలు చెబుతున్నారు.

సూపర్ స్టార్ కృష్ణ భౌతికంగా మరణించినా ఆయన నటించిన సినిమాల ద్వారా ప్రేక్షకుల హృదయాలలో మాత్రం సజీవంగా ఉంటారని ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటలు విని ఎంతో సంతోషించాను.. నాగచైతన్య కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు