బెల్లీ ఫ్యాట్ పది రోజుల్లో క‌ర‌గాలా? అయితే మీకే ఈ సూప‌ర్ డ్రింక్‌!

పొట్ట చుట్టూ చేరే అధిక కొవ్వునే.బెల్లీ ఫ్యాట్ అంటారు.

ఇటీవ‌ల రోజుల్లో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మందిని వేధిస్తున్న స‌మ‌స్య ఇది.

ఈ బెల్లీ ఫ్యాట్‌ను మోసేందుకే కాదు చూసేందుకు సైతం ఇబ్బందిగానే ఉంటుంది.అందుకే బెల్లీ ఫ్యాట్‌ను క‌రిగించు కునేందుకు ర‌క‌ర‌కాల డైటింగ్‌లు, వ‌ర్కౌట్లు చేస్తుంటారు.

కొంద‌రైతే తిన‌డం మానేసి క‌డుపును మాడ్చుకుంటూ కొవ్వును త‌గ్గించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తారు.అయిన‌ప్ప‌టికీ, ఫ‌లితం లేకుండా ఏం చేయాలో అర్థంగాక తెగ మ‌ద‌న ప‌డిపోతూ ఉంటారు.

అయితే అలాంటి వారు ఇప్పుడు చెప్ప‌బోయే సూప‌ర్ అండ్ హెల్తీ డ్రింక్‌ను రెగ్యుల‌ర్గా తీసుకుంటే గ‌నుక కేవ‌లం ప‌దంటే ప‌దే రోజుల్లో మీ బెల్లీ ఫ్యాట్ క‌ర‌గ‌డాన్ని మీరే గమ‌నిస్తారు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ సూప‌ర్ డ్రింక్ ఏంటీ.? ఎలా త‌యారు చేసుకోవాలి.? ఎప్పుడు తాగాలి.? వంటి విష‌యాల‌ను ఓ చూపు చూసేయండి.ముందుగా ఒక గిన్నెలో ఒక స్పూన్ వాము, రెండు స్పూన్ల పోపు గింజ‌లు, ఒక స్పూన్ ధ‌నియాలు, రెండు స్పూన్ల ఆవిసె గింజ‌లు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి.

Advertisement
Super And Natural Drink To Get Rid Of Belly Fat! Super Drink, Belly Fat, Latest

ఆ త‌ర్వాత రోస్ట్ చేసుకున్న గింజ‌ల‌ను ఒక మిక్సీ జార్‌లో వేసి మెత్త‌గా పొడి చేసుకుని ఒక గాజు సీసాలో భ‌ద్ర‌ప‌రుచుకోవాలి.ఇక ఈ పౌడ‌ర్‌ను ఒక గ్లాస్ హాట్ వాట‌ర్‌లో ఒక స్పూన్ చొప్పున క‌లిపి సేవించాలి.

Super And Natural Drink To Get Rid Of Belly Fat Super Drink, Belly Fat, Latest

ఈ డ్రింక్‌ను రోజూ ఉద‌యాన్నే ప‌రిగ‌డుపున తీసుకుంటే పొట్ట చుట్టూ పేరుకు పోయిన కొవ్వు క్ర‌మ క్ర‌మంగా క‌రిగి పోతుంది.అదే స‌మ‌యంలో జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు మెరుగు ప‌డి గ్యాస్‌, ఎసిడిటీ, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.ఒత్తిడి, డిప్రెష‌న్ వంటి స‌మస్య‌లు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

మ‌రియు ఇమ్యూనిటీ ప‌వ‌ర్ సైతం రెట్టింపు అవుతుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు