మీకు ఎవరికీ ఈ విషయం తెలీదు.. భీమ్లా నాయక్ సీక్రెట్ చెప్పిన సునీల్?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా తాజాగా విడుదలైన విషయం తెలిసిందే.

ఈ సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ను అందుకోవడం తోపాటు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

ఇప్పటికే ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ అయిన విషయం తెలిసిందే.మూడు రోజుల్లోనే దాదాపు గా వంద కోట్లకి పైగా గ్రాస్ మార్కును అందుకుంది.

ప్రేక్షకుల అంచనాల మేరకు భారీ అంచనాల నడుమ థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైన సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది.అదే ఈ సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సెంటిమెంట్ కోసం ఇందులో సునీల్, బ్రహ్మానందం లాంటి కమెడియన్ లను పెట్టేశారు.

అంతేకాకుండా ఈ సినిమాలో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కూడా నటించాడు.ఈ సినిమాలో కమెడియన్ సునీల్ పరిస్థితి అయితే మరీ దారుణం.

Advertisement

ఎందుకంటే ఈ సినిమాలో సునీల్ కు ఒక్కటి అంటే ఒక్క డైలాగ్ కూడా ఉండదు.కేవలం ఒక్క పాటలో అలా కనిపిస్తాడు.

అంతేకాకుండా సినిమా చూసిన వాళ్లకు అందులో సునీల్ ఉన్నాడా అంటే ఆలోచించక తప్పదు.

ఇదిలా ఉంటే తాజాగా సునీల్ భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ సమయంలో వర్కింగ్ స్టిల్ ఫొటోను షేర్ చేశాడు.అందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆ ఫోటోని షేర్ చేస్తూ భీమ్లా నాయక్ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నాను అని మీకు తెలుసు.

కానీ ఇలా కుర్చీని కూడా షేర్ చేసుకున్నాము అన్న విషయం మీకు తెలియదు అంటూ తెలిపాడు.ఈ ఫోటోను చూసిన నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.

10 గంటల పాటు డంప్ యార్డ్ లో ధనుష్.. ఈ నటుడి కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!
Advertisement
https://www.facebook.com/suniltollywood/posts/4477492775688332

తాజా వార్తలు