Ambajipeta Marriage Band: అంబాజిపేట మ్యారేజి బ్యాండ్ ట్రైలర్ రివ్యూ.. హీరోయిన్ పాత్ర చనిపోతుందంటూ?

తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్( Hero Suhas ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

సుహాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ హీరో చేతిలో అరడజన్ కు పైగా సినిమాలు ఉన్నాయి.కలర్ ఫోటో( Color Photo ) సినిమాతో భారీగా పాపులర్టీని సంపాదించుకున్న తర్వాత వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు.

ఇటీవల తండ్రిగా కూడా ప్రమోషన్ ను పొందిన విషయం తెలిసిందే.తన భార్య పండంటి ఆడబిడ్డకు జన్మని కూడా ఇచ్చింది.

సుహాస్‌ కమెడియన్‌గా నవ్వులు పూయించడమే కాదు నటుడిగా కన్నీళ్లు పెట్టించగలనని నిరూపించుకున్నాడు.

Advertisement

ప్రస్తుతం అతడు హీరోగా నటిస్తున్న చిత్రం అంబాజీపేట మ్యారేజి బ్యాండు.( Ambajipeta Marriage Band ) దుశ్యంత్‌ కటికనేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శివానీ నాగరం( Shivani Nagaram ) హీరోయిన్‌గా యాక్ట్‌ చేసింది.బుధవారం జనవరి 24న ఈ మూవీ ట్రైలర్‌ విడుదలైంది.బ్యాండ్‌ కొట్టే అబ్బాయి ప్రేమలో పడ్డాక అతడి జీవితం ఎలా ఉంది? అతడి అక్క ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది?

ఆమె కోసం ఈ హీరో ఏం చేశాడు? అన్నదే కథ.ప్రేమ, అవమానం, పగ, ప్రతీకారాల సమ్మేళనమే అంబాజీపేట మ్యారేజి బ్యాండు.అయితే ట్రైలర్‌( Trailer ) చివర్లో చితి ముందు హీరో కూర్చుని ఏడుస్తున్నాడు.

ఆ సమయంలో మన ప్రేమ నీ ప్రాణం మీదకు తేకూడదు మల్లి అని హీరోయిన్‌ చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకుంటోంది.

అంటే ఈ మూవీలో హీరోయిన్‌ చనిపోతుందా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.ఏదైతేనేం ట్రైలర్‌ అద్భుతంగా ఉందని ప్రశంసిస్తున్నారు.ప్రేక్షకుల నుంచి కూడా ఈ టైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..

ఈ సినిమా మంచి సక్సెస్ ను సాధించాలని కొందరు కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఈ మూవీని జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

శరణ్య ప్రదీప్‌, గోపరాజు రమణ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి శేఖర్‌ చంద్ర సంగీతం అందించారు.

తాజా వార్తలు