రామన్నపేటకు మంజూరైన సబ్ కోర్టును వెంటనే ప్రారంభించాలి: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి

యాదాద్రి భువనగిరి జిల్లా:( adadri Bhuvanagiri District )రామన్నపేట మండలానికి మంజూరైన సీనియర్ సివిల్ జడ్జి (సబ్ కోర్టు)ను వెంటనే ప్రారంభించాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య( Chirumarthi Lingaiah ) అన్నారు.

మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక దుర్గయ్య ఫంక్షన్ హల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను విస్మరిస్తూ నానా ఇబ్బందులకు గురి చేస్తున్నదన్నారు.ఎలాంటి షరతులు లేకుండా 2లక్షల రైతు రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసి, షరతులు విధించి సగం మంది రైతులకు మాత్రమే మాఫీ చేసిందని ఆరోపించారు.

రామన్నపేట మండల కేంద్రంలో గత ప్రభుత్వంలో మంజూరైన సబ్ కోర్టుకు స్థల సేకరణ అప్పుడే పూర్తి చేయడం జరిగిందని,వెంటనే సబ్ కోర్టును ప్రారంభించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పోషబోయిన మల్లేశం, నాయకులు నీల దయాకర్,బందెల రాములు,కంభంపాటి శ్రీనివాస్,బొక్క మాధవరెడ్డి,కన్నెబోయిన బలరాం,సాల్వేర్ అశోక్తదితరులు పాల్గొన్నారు.

మల్టీ లెవల్ మార్కెటింగ్(MLM) మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి..
Advertisement

Latest Rajanna Sircilla News