పంక్చర్ షాప్ నడుపుతూ కూతురిని చదివించిన తండ్రి.. కూతురు నీట్ టాపర్.. ఈ యువతి సక్సెస్ కు గ్రేట్ అనాల్సిందే!

ప్రతి ఒక్కరి సక్సెస్ వెనుక ఎంతో కష్టం ఉంటుంది.పోటీ ప్రపంచంలో సక్సెస్ కావాలంటే రేయింబవళ్లు ఎంతో కృషి చేయాలి.

తండ్రి పంక్చర్ షాపు నడుపుతుండగా కూతురు మాత్రం తన సక్సెస్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది.ఎంబీబీఎస్ కోసం నిర్వహించే నీట్ పరీక్షలో టాప్ ర్యాంక్ సాధించింది.

మిస్బాహ్ అనే యువతి తన సక్సెస్ తో ఎంతోమందిని ఆకట్టుకుంటూ ఉండటం గమనార్హం.

Studnet Maharashtra Achieves Neet Top Rank Details Here Goes Viral In Social Med

మహారాష్ట్ర( Maharashtra ) రాష్ట్రంలోని జాల్నా పట్టణంలో పంక్చర్ షాప్ ను నిర్వహిస్తున్న అన్వర్ ఖాన్( Anwar Khan ) కష్టపడి కుటుంబాన్ని పోషిస్తుండగా ఆయన కూతురు కెరీర్ పరంగా ఉన్నత శిఖరాలను అధిరోహించే దిశగా అడుగులు వేస్తున్నారు.నీట్ పరీక్షలో మిశాబ్ 633 మార్కులు సాధించారు.ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మిస్బాహ్ మాత్రం వాటిని అధిగమించి సక్సెస్ సాధించే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది.

Studnet Maharashtra Achieves Neet Top Rank Details Here Goes Viral In Social Med
Advertisement
Studnet Maharashtra Achieves NEET Top Rank Details Here Goes Viral In Social Med

నీట్ పరీక్షలో మంచి మార్కులు రావడంతో మిస్బాహ్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.అంకుశ్ సార్ గైడెన్స్ వల్ల నేను కెరీర్ పరంగా ఎదిగానని నీట్ లో కోరుకున్న ర్యాంక్ సాధించానని ఆమె అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.అంకుశ్ సార్ ఫ్రీగా నీట్ క్లాసులు నిర్వహించడంతో ప్రయోజనం చేకూరిందని మిస్బాహ్ చెప్పుకొచ్చారు.

కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని ఆమె కామెంట్లు చేశారు.మిస్బాహ్ టాలెంట్ కు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు.

మిస్బాహ్ మరింత కష్టపడితే కెరీర్ పరంగా మరింత మేలు జరుగుతుందని చెప్పవచ్చు.మిస్బాహ్ బాల్యం నుంచి ఒక్కో మెట్టు పైకి ఎదిగి ప్రశంసలు అందుకున్నారు.

మిస్బాహ్ ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్ గా మంచి పేరు తెచ్చుకోవాలని నెటిజన్లు ఫీలవుతున్నారు.మిస్బాహ్ కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొంతమేర ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

న్యూస్ రౌండప్ టాప్ 20 
Advertisement

తాజా వార్తలు