సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు - ఇంచార్జ్ డిఎస్పీ నాగేంద్రచారి

రాజన్న సిరిసిల్ల జిల్లా :రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని సేవలాల్ తండా గ్రామానికి చెందిన ధరంసోత్ రవి కుటుంబ సభ్యులకు, ధరంసొత్ బాలరాజ్ కుటుంబ సభ్యులకు మధ్య గొడవ జరుగగా, అట్టి గోడవ గురుంచి పోలీస్ స్టేషన్ లో ఎలాంటి పిర్యాదు ఇవ్వకుండా ధరంసోత్ రవి అతని కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ముస్తాబాద్ లోని తెలుగు తల్లి విగ్రహం వద్ద రోడ్డుపై కూర్చుని పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించగా ఇట్టి విషయం తెలుసుకొన్న ముస్తాబాద్ ఎస్.

ఐ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో వెంటనే అక్కడికి చేరుకొని ఎలాగైన రవి ని కాపాడాలనే ఉద్దేశ్యంతో తన చేతిలో ఉన్న మందు డబ్బా గుంజుకున్నాడే కాని అతనిపై చేయి చేసుకోలేదు.

కాని కొందరు వ్యక్తులు ఇట్టి విషయాన్ని చెడుగా చూపిస్తూ పోలీస్ లు దాడి చేశారని, కొట్టి లాక్కెల్లినారని నిజా నిజాలు తెలుసుకోకుండా పోలీస్ లు తప్పు చేసినట్లుగా వక్రీకరిస్తూ వాట్సాప్ గ్రూప్ లలో ప్రచారం చేసిన భాను,రాజు, నరేష్, మహేందర్ లు పోలీస్ ల పట్ల తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తుల పై కేసు నమోదు చేశామని డిఎస్పీ నాగేంద్ర చారి తెలిపారు.సోషల్ మీడియాలో నిజ నిజాలు తెలుసుకోకుండా శాంతి భద్రతలు కాపాడే పోలీస్ ల పట్ల తప్పుడు వార్తలను ప్రచారం చేసినట్లైతే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడునని డీఎస్పీ నాగేంద్ర చారి తెలిపారు.

రహదారిపై వాహనదారుల ఇబ్బందులు

Latest Rajanna Sircilla News