టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై రాళ్ల దాడి జరిగింది.విషయంలోకి వెళితే ఇటీవల గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కి చెందిన ఓ మహిళ అత్యాచారానికి గురి కావడం ఆ తర్వాత ఆమె హత్యకి గురి కావడం జరిగింది.
దీంతో హత్యకు గురైన ఆమె కుటుంబాన్ని పరామర్శించడానికి .వచ్చిన నారా లోకేష్ పై ప్రత్యర్థి పార్టీల నేతలు రాళ్ల దాడి చేయడం జరిగిందట.అయితే రాళ్ల దాడిని అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నం చేయగా.వాళ్లకి కూడా గాయాలైనట్లు వార్తలు వస్తున్నాయి.వాటికి సంబంధించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలో నారా లోకేష్ నుంచున్న చోట ఒక పెద్ద రాయి పడగా.
వెంటనే చుట్టుప్రక్కల ఉన్న టిడిపి శ్రేణులు అలర్ట్ అయ్యారు.పెద్దగా ఎవరికీ ఏం కాలేదు కానీ రాళ్ల దాడిని నిలువరించడానికి.
పోలీసులు పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు.ఈ క్రమంలో ఒక ఎస్సై తలకి పెద్ద గాయం అయింది అదేవిధంగా కానిస్టేబుల్ కి కూడా కొన్ని గాయాలు అయినట్లు సమాచారం.
మొత్తంమీద గుంటూరు జిల్లాలో హత్యకు గురైన ఆమె కుటుంబాన్ని పరామర్శించే క్రమంలో.లోకేష్ పై రాళ్ల దాడి జరగడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.