అదేంటో గానీ జగన్ ఈ మధ్య ఏ నిర్ణయం తీసుకున్నా చివరకు బెడిసి కొడుతోంది.లేదంటే ఏండ్ల కేండ్లు ఎదురు చూసి చివరకు రద్దు చేయాల్సిన పరిస్థితులు జరగుతున్నాయి.
ఒకవేళ పట్టుబట్టి ఏదైనా బిల్లు తీసుకు వస్తే చివరకు న్యాయ స్థానాల్లో కొట్టివేతకు గురవుతున్నాయి.ఇంత పెద్ద ప్రభుత్వ వ్యవస్థకు అధిపతి అయిన జగన్ ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే.
అసెంబ్లీలో స్పష్టమైన మెజార్టీ ఉంది.దేశంలో నాలుగో అతిపెద్ద పార్టీగా ఉంది వైసీపీ.
కావాల్సినంత సపోర్టు ఉంది.మరి ఇలా జగన్ నిర్ణయాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి.
మొన్నటికి మొన్న మూడు రాజధానుల బిల్లు కోర్టులో కొట్టివేసే పరిస్థితులు వస్తున్నాయని గ్రహించే జగన్ వెనక్కు తీసుకున్నారన్నది బహిరంగ రహస్యమే.ఇక దీని తర్వాత మూవీ టికెట్ల రేట్లను తగ్గిస్తూ తీసుకు వచ్చిన జీవో నెంబర్35ను కూడా ఇలాగే కోర్టు కొట్టేసింది.
అయితే ఇలా ప్రభుత్వం తీసుకు వచ్చిన బిల్లులు అన్నీ కోర్టుల్లో కొట్టేస్తుంటే.ఎక్కడో లోపం ఉన్నట్టే కదా.ఏదో ఒక లోపం ఉంటేనే దాన్ని సాకుగా చూపి కొట్టేస్తున్నాయని జగన్ గుర్తించట్లేదెందుకు అని విశ్లేషకులు భావిస్తున్నారు.వేరే సీఎంలకు ఎదురు కాని పరిస్థితులు జగన్‌కే ఎందుకు ఎదురవుతున్నాయి.

ఏదో ఒక సమస్య లోపం ఉందని, కానీ జగన్ మాత్రం అలాంటి లోపాలను ఎందుకు పసిగట్టట్లేదని వాపోతున్నారు జగన్ సన్నిహితులు.అత్యంత పకడ్బందీగా తీసుకురావాలని జగన్ ముందే ఎందుకు ఆలోచించట్లేదనేది వాదన.ఎందుకంటే ఒక సీఎంగా జగన్ తీసుకువచ్చిన పాలసీ లేదా జీవోలు కోర్టుల్లో కొట్టివేతకు గురయితే మాత్రం అది పెద్ద అవమానంగానే భావిస్తారు.ఇక దీని మీద ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేస్తాయి.
అటు ప్రజల్లో కూడా నమ్మకం పోతుంది.మరి ఇప్పటికైనా ఇలాంటి పొరపాట్లు జరగకుండా జగన్ చూస్తారో లేదో.