పెద్దవూర పంచాయితీలో కంపుకొడుతున్న డ్రైనేజీ

నల్లగొండ జిల్లా:పెద్దవూర మండల( Peddavoora ) కేంద్రంలోని ఎస్సీ కాలనీలో పావని వాటర్ ప్లాంటు పక్కన మొదటి లైన్ డ్రైనేజీ నీరు బయటికి పోకుండా జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి ఇంటి నిర్మాణంలో భాగంగా గత రెండు నెలల క్రితం డ్రైనేజీ( Drainage )కి అడ్డుగా కట్టలు వేశాడు.

దీంతో ఎస్సీ కాలనీలో ఉన్న 10 ఇండ్ల ముందు ఉన్న డ్రైనేజీలు మొత్తం నిండి,నీరు నిల్వ ఉండడంతో ఈగలు దోమలు విపరీతమైన దుర్వాసన వెదజల్లుతుంది.

ఈ విషయమై గ్రామపంచాయతీ కార్యదర్శికి( Gram Panchayat Secretary ) చెప్పినా ఇంతవరకు సమస్య పరిష్కారం చేయలేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.వర్షా కాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ఇప్పటికైనా ఉన్నతాధికారులు,ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

చర్లగూడెం భూ నిర్వాసితులకు నేను అబ్దగా ఉంటా : మునుగోడు ఎమ్మెల్యే

Latest Nalgonda News