సమంత రెమ్యున్ రేషన్ తో ఒక మీడియం రేంజ్ సినిమా తీయచ్చు...

ప్రస్తుతం సమంత( Samantha ) తన సినిమా కెరియర్ లో ముందుకు దూసుకు వెళ్తుంది.

కొద్ది నెల‌ల క్రిత‌మే స‌మంత భర్త నాగ‌చైత‌న్య( Naga Chaitanya ) నుంచి విడాకులు తీసుకుని అక్కినేని కుటుంబంతో తెగ దెంపులు చేసుకుంది.

ఆ త‌ర్వాత ఎన్నో విమ‌ర్శ‌లు ఎదుర్కొంది.మ‌యోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన ప‌డింది.

అయితే ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా.వాటి ప్ర‌భావం త‌న ప్రొఫెష‌న్ పై ఏ మాత్రం ప‌డ‌కుండా స‌మంత ఎంత‌గానో క‌ష్ట‌ప‌డింది.

ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా చిత్రాల‌తో బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తున్నారు.అలాగే రెమ్యున‌రేష‌న్ ( Samantha Remuneration )ను కూడా భారీగా డిమాండ్ చేస్తోంది.

Advertisement
Star Heroine Samantha Remuneration Going Viral On Social Media Details, Samantha

ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ స్టార్స్ ను కూడా మించిపోతోంది.ఇంత‌కు ముందు ఒక్కో సినిమాను నాలుగు నుంచి ఐదు కోట్ల రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ ఛార్జ్ చేసే స‌మంత‌ ఇప్పుడు రూ.10 కోట్లపైకు పైగా అడుగుతుంద‌ట‌.

Star Heroine Samantha Remuneration Going Viral On Social Media Details, Samantha

అడిగినంత ఇస్తేనే ప్రాజెక్ట్ పై సైన్ చేస్తాన‌ని చెప్పేస్తుంద‌ట‌.ఇక స‌మంత‌కు నేష‌న‌ల్ వైడ్ గా య‌మా క్రేజ్ ఉంది.మంచి మార్కెట్ ఉంది.

ఈ విష‌యాన్ని దృష్టిలో పెట్టుకునే నిర్మాత‌లు సైతం స‌మంత అడిగిన మొత్తం ఇచ్చేందుకు ఒప్పేసుకుంటున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.కాగా, ప్ర‌స్తుతం స‌మంత చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో `ఖుషి` ఒక‌టి.

Star Heroine Samantha Remuneration Going Viral On Social Media Details, Samantha

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ, స‌మంత కాంబోలో రూపుదిద్దుకుంటున్న రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ ఇది.అలాగే మ‌రోవైపు బాలీవుడ్ లో రాజ్ అండ్ డీకే డైరెక్ష‌న్ లో `సిటాడెల్‌` అనే వెబ్ సిరీస్ చేస్తోంది.ఇందులో వరుణ్ ధావన్, సమంత జంట‌గా క‌నిపించ‌బోతున్నారు.

చిరు, బాలయ్య రిజెక్ట్ చేసిన డైరెక్టర్ కు నాగార్జున ఛాన్స్ ఇస్తారా.. ఏమైందంటే?
పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?

ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ఇప్పుడు శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.ఇక రీసెంట్ గా స‌మంత ఓ హాలీవుడ్ మూవీకి కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు